ప్రొటీన్ పౌడర్‌ని ఇంట్లో తయారు చేయండి ఇలా వీడియో
హెల్దీ ప్రొటీన్ డ్రింక్ అంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అర్థం. అంతే తప్ప ప్యాకెట్ పై రాసి పెట్టినవన్నీ హెల్దీ డ్రింకులు కాలేవు. శరీరానికి బలాన్నిచ్చే పదార్థాలతో సహజ సిద్ధంగా చేసినవే ఆరోగ్యానికి మంచివి. కృత్రిమంగా, ఫ్లేవర్స్ కలిపి చేసేవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఇంట్లో ప్రొటీన్ డ్రింక్ తయారు చేసి తాగితే శరీరం గట్టిపడుతుంది. ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది.
ఈ ప్రొటీన్ మిక్స్ పొడిలో చక్కెర, బెల్లం బదులుగా ఎండు ఖర్జూర పొడి ఉపయోగిస్తున్నాం. కాబట్టి, ఈ డ్రింక్ టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్‌ని ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే నెల పాటు తాజాగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టక్కర్లేదు! మరి సింపుల్‌గా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ మిక్స్ పొడి ఎలా చేయాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు : ముడిపెసలు, శనగలు, కిన్వా, సోయాబీన్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదంపప్పు,. జీడిపప్పు, పల్లీలు, రెండే రెండు స్పూన్లు. ఫ్లాక్స్ సీడ్స్. స్టవ్ పై కడాయి పెట్టి విడిగా 3 నిమిషాల పాటు సన్నటి మంటపై ఫ్రై చేసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేయండి. ఈ హెల్దీ ప్రొటీన్ మిక్స్ పౌడర్‌లోకి బెల్లం, చక్కెర ఉపయోగించకుండా ఎండు ఖర్జూరం యూజ్ చేయండి. ముందుగా ఎండు ఖర్జూర లోపలి గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ ఎనర్జీ డ్రింక్ మీ ముందుంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో
ఉదయాన్నే గుడికి వచ్చిన అర్చకుడు..ఆ సీన్ చూసి షాక్ వీడియో
అడవిలో కొత్త జంట హనీమూన్.. ఊహించని అతిథుల హల్‌చల్ వీడియో
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..
కస్టమర్లా వచ్చాడు.. షాపులో ఒంటరిగా ఉన్న మహిళను అదను చూసి..
వీడు మామూలోడు కాదు.. పామునే ఫుట్ బాల్ ఆడుకున్నాడుగా!

