ఉదయాన్నే గుడికి వచ్చిన అర్చకుడు..ఆ సీన్ చూసి షాక్ వీడియో
ఉమ్మడి కర్నూలు జిల్లా శివ క్షేత్రాల్లో శ్రీశైలం తర్వాత అత్యంత కీలకమైన ఆలయం కాళ హస్తి రామేశ్వరస్వామి గుడి. దశాబ్దాల నాటి ఈ ఆలయంలోని ఐదు హుండీలను దొంగలు చోరీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆలయంలో మొత్తం ఎనిమిది హుండీలు ఉండగా వాటిలో ఐదు చిన్నవి, మూడు పెద్దవి అని ఆలయ సిబ్బంది తెలిపారు. కాగా దొంగలు ఐదు చిన్న హుండీలను టార్గెట్ చేశారు. ఆలయ అర్చకులు జూలై 13వ తేదీన స్వామివారి కైంకర్యాల కోసం ఆలయానికి రాగా అప్పటికే తలుపులు తెరిచి ఉండటంతో వెంటనే ఈవోకి సమాచారం అందించారు. దీంతో అందరూ కలిసి ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీలు కనిపించకుండా పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి 1 గంట టైంలో ఇద్దరు మాస్కులు వేసుకున్న వ్యక్తులు మెయిన్ గాటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీలను అపహరించినట్లుగా స్పష్టమైంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు పక్కన కాలువలో హుండీలను పగలగొట్టి అందులో చిల్లర నాణాలను వదిలేసి నోట్ల కరెన్సీని దొంగలు దోచుకెళ్లారు.
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
