చుండ్రు తలలోనే కాదు కళ్లపైన కూడా.. జాగ్రత్తపడకపోతే అంతే!
చుండ్రు అనగానే అందరికీ గుర్తొచ్చేది తలభాగమే. సాధారణంగా తలలో వచ్చే డ్యాండ్రఫ్ గురించి అందరికీ తెలుసు. చాలామందికి కనుబొమ్మలు, కనురెప్పలపైన కూడా చుండ్రు వస్తుందని తెలియదు. అంతేకాదు ఇది చాలా ప్రమాదకరమైనది కూడా. కనురెప్పలపై ఉండే చుండ్రు పైకి అంతగా కనిపించకపోయినా, కళ్ళపైన మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కనురెప్పలపై చుండ్రు అనేది కంటి రెప్పలపై బ్యాక్టీరియా పేరుకుపోయినప్పుడు వస్తుందట. అంతేకాకుండా ఆయిల్ ఫేస్, పొడికళ్ళు వంటి సమస్యలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంటున్నారు. కనురెప్పలపై చుండ్రు ఉన్నప్పుడు కంటిపై తెలుపు లేదా పసుపు రంగు పొరలు, దురద, కళ్ళు ఎర్రగా మారడం, చూపు మందగించడం, వెలుతురును సరిగ్గా చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రోజు గోరువెచ్చని నీటితో కాటన్ క్లాత్ ను ముంచి ఐదు నుంచి పది నిమిషాల పాటు కళ్ళను శుభ్రపరుచుకోవాలి. దాంతో కాస్త ఉపశమనం కలుగుతుంది. కనురెప్పలపై చుండ్రు ఏర్పడటం వలన కంటి ఇన్ఫెక్షన్, పొడికళ్ళు, సైట్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఈ లక్షణాలు తీవ్రతరమైతే కార్నియా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు.
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

