వీళ్ల తెలివికి హ్యాట్సాఫ్.. నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన యువకులు
పుణెలోని జలపాతం వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. జులై 12వ తేదీన జలపాతం ప్రవాహంలో చిక్కుకున్న పర్యాటకుడిని కాపాడేందుకు అక్కడి యువకులు ప్రయత్నం చేశారు. తమ వద్ద ఉన్న స్కార్ఫ్‌లు, శాలువాలను కలిపి తాడు తయారుచేసి దాని సాయంతో బాధితుడిని వరద నీటి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.
జలపాతం అందాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక పర్యాటకుడు అందరిలాగే జలపాతం కింద నిలబడి పైనుంచి పడుతున్న నీటికింద కేరింతలు కొడుతున్నాడు. అంతలోనే ఊహించని రీతిలో కాళ్లు జారి దిగువకు జారిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో వందల అడుగుల లోతున ఉన్న గుంట అంచున చిక్కుకున్నాడు. దీంతో బాధితుడిని గమనించిన తోటి పర్యాటకులు వెంటనే రంగంలోకి దిగారు. తమ స్కార్ఫ్‌లు, చున్నీలు, శాలువాలను తాడులా తయారుచేసి జలపాతపు ప్రవాహంలోకి విసిరారు. దీంతో దిగువన ఉన్న ఆ యువకుడు దానిని పట్టుకొని నెమ్మదిగా పైకి వచ్చాడు. అయితే బండ రాళ్లలో అతని కాళ్లు ఇరుక్కుపోయి బయటకు రాలేక కాసేపు అతడు ఇబ్బంది పడ్డాడని తోటి పర్యాటకులు తెలిపారు.
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

