బట్టతలనే బిల్‌బోర్డ్ గా మార్చుకున్న యువకుడు..వేలల్లో సంపాదన వీడియో
వంశపారపర్యంగా లేదా పురుష హార్మోన్ల తేడా వల్ల వచ్చే బట్టతలను ఒక సమస్యగా భావించి ఆందోళన చెందుతూ ఉంటారు. బట్టతలపై రకరకాల జోక్స్ వినిపిస్తూనే ఉంటాయి. దీంతో బట్టతల సమస్యతో ఇబ్బంది పడేవారు మందులు, లేజర్ థెరపీ, హెయిర్ ట్రాన్స్ ఫర్ వంటి రకరకాల చికిత్సను తీసుకుంటున్నారు. అయితే బట్టతల గురించి బెంగ ఎందుకు.. ఈ సమస్యని కూడా సద్వినియోగం చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నాడో వ్యక్తి.
తన తలను బిల్‌బోర్డ్‌గా మార్చి డబ్బులు సంపాదిస్తున్నాడు.బట్టతల వచ్చిందని బెంగ పడుతున్నారా.. ఇకపై అవమానకరం కాదు.. ఆదాయ వనరు అని కేరళలోని అలప్పుజకు చెందిన ట్రావెల్ వ్లాగర్ షఫీక్ హషీమ్ నిరూపించాడు. అతను తన బట్టతల తలను ప్రకటనల స్థలంగా మార్చుకున్నాడు. యాడ్ ను ప్రదర్శించడం ద్వారా 50వేల రూపాయిల సంపాదించాడు. అంబలపుళలోని కరూర్‌కు చెందిన 36 ఏళ్ల షఫీక్ తన ఫేస్‌బుక్ పేజీలో తన బట్టతలనే బిల్‌బోర్డ్‌గా మార్చుకోవాలనుకున్నాడు. ఆసక్తి గల బ్రాండ్‌లు ప్రకటనలు ఇవ్వమంటూ ఆహ్వానించాడు. తద్వారా తన బట్టతల సామర్థ్యాన్ని అన్వేషించాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో వందలాది కంపెనీలు షఫీక్ ను సంప్రదించాయి. ట్రావెల్ వ్లాగర్‌గా ఉన్న ప్రజాదరణ కూడా అతను చేసిన ప్రకటన క్లయింట్‌లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది. మొదటి ఒప్పందం కొచ్చికి చెందిన లా డెన్సిటే కంపెనీతో చేశాడు షఫీక్. అంతేకాదు తన బట్టతల తలపై ప్రకటనను ప్రదర్శించిన మొదటి భారతీయుడు తానేనని షఫీక్ పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
అందమైన అమ్మాయి ఫోటో దిగుతుంటే.. ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి!
దారితప్పి తల్లికోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. తల్లిని కలిసిన తర్వాత వీడియో
ప్రొటీన్ పౌడర్‌ని ఇంట్లో తయారు చేయండి ఇలా వీడియో
ఇక రైళ్లలో చీమ చిటుక్కుమన్నా అవి కనిపెట్టేస్తాయ్ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
