అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
సోషల్ మీడియాలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అవి చాలావరకు భయం కలిగించేలా ఉంటాయి. అయితే ఈ పాము వీడియో చూస్తే మాత్రం మీ మనసు చివుక్కుమంటుంది. పాము తల ప్లాస్టిక్ బాటిల్లో ఇరుక్కుపోవడంతో ఓ పాము తీవ్రంగా బాధపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో వన్య ప్రాణి ప్రేమికులనే కాకుండా.. సామాన్యులకు కూడా బాధ కలిగిస్తుంది.
పాము తల ఒక బాటిల్లో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. దీంతో దానికి దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతూ, ఎటుపోతుందో తెలియక అయోమయంగా మారింది ఆ పాము పరిస్థితి. మార్గం కనిపించకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆ పాము శరీర కదలికల ద్వారా స్పష్టమవుతోంది. ఈ పాము పరిస్థితికి కారణం మనుషులే అని గుర్తించాలి. అడవుల్లో, కాలువల్లో, రోడ్ల పక్కన ప్లాస్టిక్, ఇతర పనికిరాని వస్తువులు విసిరేయడం వల్ల అమాయక జీవుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ప్లాస్టిక్ వాడకం కేవలం మనకే కాదు, మిగిలిన జీవులకు కూడా ముప్పే” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. చెత్త నిర్వహణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు… ప్రతీ ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని మరొకరు వ్యాఖ్యానించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. వాటిని రీసైకిల్ చేయాలి. నింగి, నీరు, ఈ నేల అందరిదీ అని గుర్తెరిగి బాధ్యతగా నడుచుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం :
ఈ కుక్కలతో జాగ్రత్త.. కరిస్తే అంతే సంగతులు వీడియో
బట్టతలనే బిల్బోర్డ్ గా మార్చుకున్న యువకుడు..వేలల్లో సంపాదన వీడియో
కొన్న కోడికన్నా..కొట్టుకొచ్చిన కోడి రుచి ఎక్కువంట.. అందుకే వీడియో
అనారోగ్యంతో ఆసుపత్రికి పోతే.. కాన్పు చేసిన వైద్యులు వీడియో
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

