ఇవి పాల ప్యాకెట్లు అనుకునేరు.. లోపల చూస్తే షాకవుతారు వీడియో
కల్తీ కల్లు హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో తొమ్మిది మందిని బలి తీసుకుంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఎక్కడికక్కడ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో శాఖ నిజాలు వెలుగు చూస్తున్నాయి. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాకెట్లలో కల్లు విక్రయిస్తున్నారు. కండ్లకోయ, అయోధ్యనగర్, గుండ్లపోచంపల్లి పరిసర ప్రాంతాల్లో చాప కింద నీరులా పాల ప్యాకెట్లలో పాలలా కల్లు ప్రవహిస్తోంది. ఇప్పటివరకు మనకు పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, ఆపై సారా ప్యాకెట్లు తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా కల్లు ప్యాకెట్లు వచ్చాయి. వీటిని చూసిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్సైజ్ పోలీసుల దాడులు తీవ్రతరం చేయడంలో కల్తీ కల్లూ రాయుళ్లు కొత్త దారులు ఎంచుకున్నారు. పాల ప్యాకెట్లను మించిన ప్యాకింగ్ తో అద్భుతమైన బ్రాండింగ్ తో సరికొత్తగా కల్లు ప్యాకెట్లను తీసుకొచ్చారు. సీసాల్లో నింపి సిప్పు తాగేసరికి సమయం పడుతుందనుకున్నారేమో ఇన్ స్టంట్ గా మజ్జిగ ప్యాకెట్ల తరహాలో కల్లు ప్యాకెట్లను మార్కెట్లోకి దించేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్యాకెట్లలో నింపి కల్లు విక్రయిస్తున్నారు విక్రేతలు. ఎలాంటి అనుమతులు లేకుండా పాల ప్యాకెట్ల మాదిరి ప్యాక్ చేసి కల్లు విక్రయిస్తున్నారు. రెండు రోజుల క్రితం దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చెట్ల నుంచి తీసేదంతా కల్లే కానీ తాగేదంతా కల్లు కాదు. తెల్లనివన్నీ పాలు కానట్లే నూరుగు కక్కేదంతా కల్లు కానే కాదు. కల్తీ చేయడం కాదు రసాయనాలు కలిపి మరి కృత్రిమంగా తయారు చేస్తున్నారు. దానికి అలవాటుపడ్డ ప్రాణాలు ఆ మత్తు నుంచి బయటపడలేక పోతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
