AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్‌, రోబోలతో సిరుల సేద్యం వీడియో

ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్‌, రోబోలతో సిరుల సేద్యం వీడియో

Samatha J
|

Updated on: Jul 22, 2025 | 9:49 PM

Share

ఏఐ రాకతో అన్ని రంగాల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో అత్యాధునిక మార్పులు వస్తున్నట్లే..వ్యవసాయ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచం మొత్తం ఏఐ చుట్టూ తిరుగుతోంది. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత వ్యవసాయం మనం చూడబోతున్నాం. పొలంలో నేల నాణ్యతను, పంట ఎదుగుదలను, చీడపీడల ఉనికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాన్ చేస్తోంది.

ఎలాంటి పురుగు మందులను, ఎరువులను ఎక్కడ.. ఎంత పరిమాణంలో పిచికారీ చేయాలో సూచిస్తుంది. పంటలలో కలుపు మొక్కలను మెషిన్ లెర్నింగ్ గుర్తిస్తుంది. ఆకుల పరిమాణం, ఆకారం, రంగును కంప్యూటర్ విజన్ గుర్తించాక రోబోలు వచ్చి కలుపుతీస్తాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. పంటలకు ఏ సమయంలో ఎంత స్థాయిలో నీటిని అందించాలో ఐవోటీ సెన్సర్లు చూసుకుంటాయి.ఇక పంట చివరి దశకు వచ్చిన విషయాన్ని కూడా ఏఐ గుర్తించి.. రోబోలకు ఆదేశమిచ్చి డిజిటల్ ఆటోమేషన్ ద్వారా కోతలను పూర్తి చేస్తుంది. చివరగా దిగుబడుల ఆకారం, రంగు, పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ ఇస్తుంది. మార్కెటింగ్ అవకాశాలనూ సూచిస్తుంది. ఇదంతా ఎక్కడో.. అమెరికా, ఇజ్రాయెల్, జర్మనీ వంటి దేశాల పొలాల్లో జరిగే అధునాతన వ్యవసాయం గురించి అనుకుంటున్నారా..! కాదు మన తెలంగాణ లోనూ డిజిటల్ వ్యవసాయంకు కసరత్తు మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం :

ఈ కుక్కలతో జాగ్రత్త.. కరిస్తే అంతే సంగతులు వీడియో

బట్టతలనే బిల్‌బోర్డ్ గా మార్చుకున్న యువకుడు..వేలల్లో సంపాదన వీడియో

కొన్న కోడికన్నా..కొట్టుకొచ్చిన కోడి రుచి ఎక్కువంట.. అందుకే వీడియో

అనారోగ్యంతో ఆసుపత్రికి పోతే.. కాన్పు చేసిన వైద్యులు వీడియో