లైవ్ కవరేజ్ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ వీడియో
విధి నిర్వహణలో జర్నలిస్టులు కొన్నిసార్లు ధైర్యసాహసాలను ప్రదర్శించక తప్పదు. కానీ, అదే ధైర్యం వారి ప్రాణాలకే ముప్పు తీసుకొస్తూ ఉంటుంది. బాంబుల వర్షం పడుతున్నా, భూకంపాలు వచ్చినా, సునామీలు పోటెత్తినా, కరోనా లాంటి మహమ్మారి విజృంభించినా.. ఏ మాత్రం భయపడకుండా.. తమ కర్తవ్యాన్ని నిర్వహించేవారే జర్నలిస్టులు.
తాజాగా ఓ జర్నలిస్ట్ భారీ వర్షాలు, వరదల గురించి రిపోర్ట్ చేస్తూ.. అదే వరదలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని రావల్పిండిలో చోటు చేసుకుంది. చేతిలో మైక్రోఫోన్ పట్టుకుని.. మెడ లోతు నీటిలో నిలబడి.. ఆ రిపోర్టర్ లైవ్ కవరేజ్ అందిస్తుండగా, నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. అల్ అరేబియా ఇంగ్లీష్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో కేవలం తల, చేయి మాత్రమే కనిపించేలా ఓ జర్నలిస్ట్ వరదలో దిగి లైవ్ రిపోర్టింగ్ అందిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతని ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తూ అతని భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది జర్నలిస్ట్ ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఇది ధైర్యవంతమైన జర్నలిజమా లేకా రేటింగ్‌ల కోసం నిర్లక్ష్యంగా అతిగా వ్యవహరించడమా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మతిస్థిమితం కోల్పోయిన క్రేజీ నటి .. రోడ్లపై తిరుగుతూ..చివరకు
ఇదెక్కడి చోద్యం.. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్ వీడియో
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
