ఇదెక్కడి చోద్యం.. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్ వీడియో
ఒక పురుషుడు ఇద్దరు, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఒకే పందిరిలో ఇద్దరిని వివాహమాడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఓ అరుదైన వివాహం జరిగింది. ఒకే పందిరిలో యువతి ఇద్దరు అన్నదమ్ములను వివాహం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో హట్టి అనే తెగకు సంబంధించిన సంప్రదాయమట.
సిర్కౌర్ జిల్లా షిల్లాయ్ గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అన్నదమ్ములు హట్టి తెగ సంప్రదాయం ప్రకారం అదే గ్రామానికి చెందిన సునితా చౌహాన్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా ఆ తెగలో ఈ ఆచారాన్ని ఎవరూ పాటించడంలేదు. కానీ తాజాగా అన్నదమ్ములు ఒకే యువతిని వివాహం చేసుకుని మళ్లీ తమ సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. ఇక వివాహం చేసుకున్న అన్నదమ్ముల్లో అన్న జలశక్తి డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగం చేస్తుండగా తమ్ముడు విదేశాల్లో ఉంటూ టూరిజానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్నాడు. తమ సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఒకే ఒక్క కారణంతో ఈ వివాహం చేసుకున్నట్లు అన్నదమ్ములు తెలిపారు. ఈ వివాహం గురించి వధువు సునీతా చౌహాన్ ఏం చెప్పారంటే.. ఈ పెళ్లి తన అంగీకారంతోనే జరిగిందని చెప్పింది. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
ఇవి పాల ప్యాకెట్లు అనుకునేరు.. లోపల చూస్తే షాకవుతారు వీడియో
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
