అద్దె ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తికి..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఓనర్
కొన్నేళ్లపాటు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటే.. ఆ ఇంటి ఓనర్‌తో అనుబంధం ఏర్పడుతుంది. అయితే, ఆ అనుబంధం విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకునేంత గొప్ప బంధం అని చెప్పలేము. కానీ, బెంగళూరులో అదే జరిగింది. తన ఇంట్లో రెండేళ్ల పాటు అద్దెకుండిపోతున్న వ్యక్తికి వెండి కడియం బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ బహుమతి స్వీకరించిన వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇల్లు ఖాళీ చేస్తున్న తనకు.. తన ఇంటి యజమాని వెండి బ్రేస్‌లెట్ బహుమతిగా ఇచ్చాడని, ఆయన గొప్ప మనసున్న మనిషి అని రెడ్డిట్ ఖాతాలో సదరు టెనెంట్ తన అనుభవాన్ని షేర్ చేశాడు. అద్దె ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి యజమాని ఇచ్చిన ప్రేమపూర్వక వీడ్కోలు బహుమతి గురించి రాసుకొచ్చాడు. సాధారణంగా బెంగళూరులో ఇంటి యజమానులు తాము తీసుకునే రెంట్ డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వరని, పైపెచ్చు.. ఖాళీ చేసే వెళ్లే సమయంలో ఇల్లంతా పాడుచేశారని మాట్లాడుతుంటారని, కానీ, తన ఓనర్ అందుకు భిన్నంగా గొప్ప వీడ్కోలు బహుమతి ఇచ్చారని తెలిపాడు. తాను ఆ ఇంటిలో రెండు సంవత్సరాలు ఉన్నానని, ఆ ఇంటి ఓనర్ తనను సొంత కొడుకులా చూసుకున్నాడని కితాబిచ్చాడు. తనకు వీడ్కోలు బహుమతిగా వెండి బ్రాస్లెట్ ఇవ్వడం తన సంతోషాన్ని రెట్టింపు చేసిందని వ్యక్తం చేశాడు. అద్దెకు ఉన్నవారు ఖాళీ చేస్తామని చెప్పిన మరుక్షణం నుంచే ఎవరు అద్దెకు వస్తారా? అని ఎదురుచూసే ఈ రోజులలో ఇలాంటి ఓనర్ ఉండటం నిజంగా గొప్ప విషయమే అని నెటిజన్లు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నారుమడి కాదు.. గుర్రపుడెక్క.. శ్రీశైలం జలాశయంలో అరుదైన దృశ్యం
రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

