AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కప్పలకు పెళ్లి చేసిన చిన్నారులు.. ఎందుకంటే

కప్పలకు పెళ్లి చేసిన చిన్నారులు.. ఎందుకంటే

Phani CH
|

Updated on: Jul 28, 2025 | 7:51 PM

Share

ఇటీవల కాలంలో కప్పలు ఎక్కువగా వార్తలకెక్కుతున్నాయి. పసుపు పచ్చ కప్పలు.. కప్పల పెళ్లి ఇలా ఏదొక అంశంతో కప్పలు వార్తల్లో నిలుస్తున్నాయి. వర్షాకాలం కావడంతో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఈ క్రమంలో కప్పలు సంతానోత్పత్తి కోసం వాటిని ఆశ్రయిస్తున్నాయి.

ఇక కప్పల పెళ్లి విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కోరుతూ కప్పలకు పెళ్లి జరిపించడం సంప్రదాయం. ఈ క్రమంలో కొందరు గిరిజన చిన్నారులు వర్షాలు కురవాలని కోరుతూ కప్పలకు పెళ్లి జరిపించారు. అల్లూరి జిల్లా,రాజవొమ్మంగి మండలంలోని బదనాంపల్లి గిరిజన గ్రామంలోని విద్యార్థులు కప్పలకు పెళ్లి జరిపించారు. వీరికి ఆ పిల్లల తల్లిదండ్రులు సైతం తోడై కప్పల పెళ్లి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గ్రామంలో ఏటా సకాలంలో వర్షాలు కురవకపోతే ఇలా కప్పలకు పెళ్లి జరిపించడం ఆనవాయితీ. అందులో భాగంగా పాలకర్రకు రెండు కప్పలను కట్టి, వాటికి కొత్త బట్టలు వేసి పూలతో అలంకరించి ఊరంతా ఊరేగిస్తూ పసుపు నీళ్లను చల్లి అందరితో అక్షింతలు వేయించి దగ్గరలోని కాలువలో వదులుతారు. ఇలా చేయడం వల్ల వర్షాలు పడతాయని అక్కడ గిరిజనుల విశ్వాసం. అయితే ఈ తంతు పెద్దలు కాకుండా పిల్లలతో చేయించడం ఆనవాయితీ అని గ్రామస్తులు చెబుతున్నారు. పాలకర్రకు రెండు కప్పలను కట్టి బంధం వేసి, డప్పువాయిద్యాలతో ఊరేగిస్తూ వారధి పోస్తారు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని.. అందుకే గ్రామంలోని పురవీధుల్లో తిప్పి అనంతరం వాటికి వాగు వద్ద ప్రత్యేక పూజలు చేసి అందులో వదిలేస్తామని వెల్లడించారు. జూలై వచ్చినా సరైన వర్షాలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు వరి నాట్లు పడలేదన్నారు. అందుకే వర్షాల కోసం ఇలా కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నామని, ఏటా ఇలానే చేయడం వల్ల వర్షాలు పడుతున్నాయని, అందుకే గ్రామంలో పిల్లలతో కప్పలకు పెళ్లి చేయించామని గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాములకు ఇవంటే చచ్చేంత భయం

ఒకదానికొకటి ఎదురుపడిన రెండు కింగ్‌ కోబ్రాలు.. ఆ తర్వాత

కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?

మధ్యప్రదేశ్‌లో యువకుడి ప్రాణం తీసిన చెప్పు..

హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందా? నిపుణులు ఏం చెప్పారు?