నారుమడి కాదు.. గుర్రపుడెక్క.. శ్రీశైలం జలాశయంలో అరుదైన దృశ్యం
శ్రీశైలం జలాశయం పరిధిలో పచ్చదనం కనువిందు చేస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహానికి కొట్టుకొస్తున్న గుర్రపు డెక్క శ్రీశైలం జలాశయంలో బ్యాక్ వాటర్‌లోకి భారీగా చేరటంతో దూరం నుంచి చూసే వారికి అదొక పచ్చని గార్డెన్ మాదిరిగా కనిపిస్తోంది. శ్రీశైలం అందాలను చూడడానికి వచ్చిన పర్యాటకులంతా సువిశాలమై పచ్చని వరి నారు మడిలా కనిపిస్తున్న దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు
డ్యామ్ పై నుంచి ఈ సీన్ ను చూసి.. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడిచేస్తున్నారు. అయితే వరద సమయంలో కొట్టుకొచ్చే ఈ గుర్రపు డెక్కను వెంటనే తొలగించకపోతే.. వాటి ఆకులు కుళ్లిపోయి నీరు కలుషితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుర్రపుడెక్క విస్తరిస్తే.. జలాశయంలోని జలచరాలకు కూడా ఇబ్బందేనని వారు చెబుతున్నారు. 2018 సంవత్సరంలో కూడా ఇలానే గుర్రపుడెక్క భారీగా శ్రీశైలం జలాశయానికి వచ్చిందని, అప్పట్లో వారం రోజుల సమయంలోనే దానిని తొలగించారని వారు గుర్తుచేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే
కప్పలకు పెళ్లి చేసిన చిన్నారులు.. ఎందుకంటే
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

