వాటి కోసమే సరికొత్తగా హాస్టళ్లు.. మంచి ఆహారం, వైద్య సేవలు లభ్యం
చాలామందికి పెంపుడు జంతువులంటే ప్రాణం. ఇలాంటి జంతు ప్రేమికులు.. వాటిని కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమిస్తుంటారు. అలాగే, వాటి ఆలనా పాలనా చూస్తుంటారు. తమ పెట్స్‌కి కాస్త దెబ్బతగిలినా.. వీరు విలవిలలాడిపోతారు. తమ నేస్తాల కోసం.. ప్రత్యేక ఆహారం, వైద్య సదుపాయాలు కల్పిస్తుంటారు. అయితే..ఈ జంతు ప్రేమికులు ఏదైనా పొరుగూరు వెళ్లి నాలుగైదు రోజులుండాలంటే వారికి ప్రాణం పోయినట్లుగా ఉంటోంది.
ఇంట్లోనే పెట్స్‌ను వదిలేస్తే.. వాటి ఆలనాపాలనా చూసే వాళ్లు ఉండరని, అవి దిగులు పడి జబ్బు పడతాయని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యకు చక్కని పరిష్కారంగా..పలు నగరాలలో అనేక సదుపాయాలతో పెట్స్ హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా, గుంటూరు నగరంలో ఇదే తరహాలో ఓ డాగ్ హాస్టల్ ప్రారంభమైంది. ఈ హాస్టల్‌లో పెట్స్‌ని గంటలు, రోజులు, నెలలు.. ఇలా అవసరమైనంత కాలం వదిలివెళ్లవచ్చు. ఇక్కడ పెట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సౌకర్యవంతమైన ఎన్ క్లోజర్స్ ఉన్నాయి. పెట్స్ కోసం కొన్ని ఆటబొమ్మలు, మంచి ఆహారం, విశ్రాంతి తీసుకునే బెడ్ వంటివి ఏర్పాటు చేశారు. ఆహారాన్ని ఇచ్చేటప్పుడు వీడియోలు తీసి యజమానులకు వాట్సాప్‌లో పంపుతున్నారు. డాగ్స్ తమ యజమానిపై బెంగపెట్టుకోకుండా వాటిని ఎంటర్‌టైన్ చేయటం, జబ్బు పడితే వైద్యం చేయటానికి కేర్ టేకర్లు కూడా ఉంటారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలకు తీర్థయాత్రలకు వెళ్లేవారు, నాలుగైదు నెలల పాటు విదేశాలకు వెళ్లేవారు తమ పెట్స్‌ను ఈ హాస్టల్స్‌లో ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే హాస్టల్స్ లో పూర్తిగా ఏసి సౌకర్యం కల్పిస్తున్నారు. వీటికి తోడుగా పార్లర్లను ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్దె ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తికి..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఓనర్
నారుమడి కాదు.. గుర్రపుడెక్క.. శ్రీశైలం జలాశయంలో అరుదైన దృశ్యం
రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

