Rakhi Festival: సోదరులపై ప్రేమని అందమైన రాఖీతో చెప్పాలనుకుంటున్నారా.. మార్కెట్‌లో సందడి చేస్తోన్న తాజా డిజైన్లపై ఓ లుక్ వేయండి..
శ్రావణ మాసం వస్తే చాలు మార్కెట్ లో రాఖీల సందడి మొదలవుతుంది. రకరకాల డిజైన్లలో రాఖీలు కనిపిస్తున్నాయి. శ్రావణ పౌర్ణమి రోజుని రాఖీ పండగగా హిందువులు జరుపుకుంటారు. ఈ రోజు సోదరుడు, సోదరీమణుల అనురాగం, ప్రేమ, రక్షణ, విడదీయరాని బంధానికి చిహ్నం. ఈ పండగను ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండగ ఆగస్టు 9వ తేదీన జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రాఖీ తాజా డిజైన్లపై ఓ లుక్ వేయండి. చూద్దాం.
Updated on: Jul 29, 2025 | 5:06 PM

రాఖీ పండగ అంటే రక్షణ కోరుతూ సోదరి తన సోదరుడి మణికట్టుకి కట్టే దారం. కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా రాఖీల్లో కూడా రాకరకలుగా మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు చైన్ రాఖీల ట్రెండ్ చాలా పెరిగింది. చైన్ తరహాలో ఉండే ఈ రాఖీ సింపుల్ గా అందంగా కనిపిస్తుంది. చేతికి ఒక బ్రాస్ లెట్ తరహాలో ఈ రాఖీ కనిపిస్తుంది. కనుక మీ సోదరుడికి సింపుల్ లుక్ లో ఉండే రాఖీ అంటే ఇష్టం అయితే ఇలాంటి రాఖీని ఎందుకోవచ్చు.

నాజర్ వలీ రాఖీ కొంతకాలంగా ట్రెండ్‌లో ఉంది. ఈ రాఖీ చాలా కళాత్మకంగా కనిపిస్తుంది. ఈ రాఖీ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. మార్కెట్లో ఇలాంటి రాఖీల డిజైన్లు లభిస్తున్నాయి. తేలికైనా రాఖీలతో పాటు.. బరువుగా భారీ పనితో ఉండే అనేక నాజర్ వలీ రాఖీలున్నాయి. ఈ రాఖీని ఎంచుకునే సోదరి తన సోదరులపై చెడు దృష్టి పడకుండా కట్టవచ్చు.

నేటి యువతకు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని బైక్ బొమ్మ ఉన్న రాఖీలను కూడా తయారు చేశారు. ఈ బైక్ రాఖీ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ రకమైన సింపుల్ రాఖీ చిన్న పిల్లలకు ఉత్తమమైనది. మార్కెట్లో అనేక రకాల డిజైన్లు ఉన్నాయి. అంతేకాదు చిన్న పిల్లలకు ఇష్టమైన కార్టూన్‌తో ఉన్న రాఖీని కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు.. పిల్లలని ఆకర్షించేలా లైట్లు ఉన్న రాఖీలను కూడా ఎంచుకుని ఖరీదు చేయవచ్చు.

పిల్లల కోసం రాళ్లతో ఉన్న రాఖీలు చాలా అందమైన ఎంపిక. రాఖీలకు రాళ్ళు ఉండి.. ఇంద్ర ధనుస్సు చేతి మీదకు వచ్చినట్లు అనిపించేలా ఉండే ఈ రాఖీలు పిల్లలకు బెస్ట్ ఎంపిక. మీరు పిల్లల కోసం ఈ రకమైన రాఖీని కొనుగోలు చేయవచ్చు. వీటిల్లో కార్టూన్లలతో పాటు అనేక డిజైన్లు కూడా ఉన్నాయి. పిల్లలు ఇటువంటి రాఖీలను చాలా ఇష్టపడతారు.

దారం, రకరకాల బీడ్స్ తో పాటు ముత్యాలతో ఉన్న బ్రాస్లెట్ రాఖీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మీ కంటే పెద్ద అయిన అన్నకు బెస్ట్ ఎంపిక. దీనితో పాటు సోదరుడి కోసం థ్రెడ్ రాఖీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ దారానికి ముత్యం, రాళ్ళతో చేసిన డిజైన్ మరింత అందాన్ని తీసుకొస్తుంది.

ప్రస్తుతం క్రిస్టల్ రాఖీ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉంది. గులాబీ డిజైన్ తో పాటు అనేక ఇతర స్ఫటికాలు ఉన్న రాఖీలను కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా తమ సోదరుడి రాశి ప్రకారం రాఖీలను ఎంపిక చేసుకోవాలని కోరుకుంటే ఈ తరహా రాఖీలను ఎంపిక చేసి కొనుగోలు చేయవచ్చు. రాఖీలను బ్రాస్లెట్ తరహాలో లేదా.. దారం.. ఇలా రెండింటిలోనూ కొనుగోలు చేయవచ్చు. కనుక ఇటువంటి రాఖీలను సోదరుడు కొనుగోలు చేయవచ్చు.




