గుండె జర భద్రం బ్రదర్.. ఈ మార్పులతో రోగాలకు ఇట్టె చెక్ పెట్టొచ్చు.. ఇలా చేస్తే ఇక నో టెన్షన్..
ఉరుకులు పరుగుల జీవితంలో గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి.. ఇది పెద్దవారితో పాటు.. యువతను కూడా ప్రభావితం చేస్తున్న సైలెంట్ కిల్లర్.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు మరణాలలో ఒక మరణానికి గుండె జబ్బులే కారణం. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. నిరంతరం పెరుగుతున్న ఒత్తిడి.. శారీరక శ్రమ లేకపోవడం.. యువతను ప్రమాదంలో పడేస్తున్నాయి.

ఉరుకులు పరుగుల జీవితంలో గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి.. ఇది పెద్దవారితో పాటు.. యువతను కూడా ప్రభావితం చేస్తున్న సైలెంట్ కిల్లర్.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు మరణాలలో ఒక మరణానికి గుండె జబ్బులే కారణం. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. నిరంతరం పెరుగుతున్న ఒత్తిడి.. శారీరక శ్రమ లేకపోవడం.. యువతను ప్రమాదంలో పడేస్తున్నాయి. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం.. గుండె జబ్బుల భారంలో 75 శాతం భారతదేశంతో సహా తక్కువ, మధ్యతరగతి ఆదాయ దేశాలపై పడుతుంది. మనం ఇప్పుడు మేల్కొనకపోతే, భవిష్యత్తులో పెను ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. గుండె సంబంధిత మరణాలలో సుమారు 25 శాతం వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి. ఇది ఈ కఠినమైన సత్యానికి నిదర్శనం. ప్రతి సంవత్సరం, సుమారు 7 మిలియన్ల మంది కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. అంటే కాలుష్యం నేరుగా.. హృదయాల ఆరోగ్యంతో ముడిపడి ఉండటంతోపాటు.. ఎక్కువగా ప్రభావితం చేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో మన జీవనశైలి, అలవాట్లు, ఆలోచన కూడా గుండెను జాగ్రత్తగా చూసుకునేలా ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యం ఉంచుకునేలా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవడం మంచిదని. దీని ద్వారా.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.
జీవనశైలిలో మార్పులు చేసుకోండి:
ఆరోగ్యకరమైన హృదయాన్ని కాపాడుకోవడానికి గణనీయమైన మార్పులు అవసరమని నిపుణులు విశ్వసిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు తినడం, చక్కెర – ఉప్పు తీసుకోవడం తగ్గించడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా అవసరం.
అలాగే తగినంత నిద్రపోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం, సంతృప్త కొవ్వులు తగ్గించడం వంటివి కూడా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి..
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం లేదా నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదనంగా, ఒత్తిడిని నిర్వహించడానికి యోగా – ధ్యానం మీ దినచర్యలో చేర్చుకోవాలి.
ధూమపానం మానేయండి.
వీటితోపాటు.. ధూమపానం మానేయడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. కేవలం రెండు సంవత్సరాలలో, మీ ప్రమాదం సగానికి తగ్గుతుంది. 15 సంవత్సరాలలో, మీరు ధూమపానం చేయని వ్యక్తిలా తిరిగి మారుతారు.. దీంతోపాటు క్రమం తప్పకుండా రక్తపోటు, చక్కెర – కొలెస్ట్రాల్ తనిఖీలు కూడా గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మీకు ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




