Health Tips: మీరు చేసే ఈ తప్పులతో మెదడు ముసలిది అయిపోతుంది.. లైట్ తీసుకోవద్దు..
నిద్ర లేకపోవడం వల్ల మీ మెదడు అలసిపోయి, నీరసంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా? నిద్ర సరిగా లేకపోవడం వల్ల అలసట, చిరాకు మాత్రమే కాకుండా మీ మెదడు మీ వాస్తవ వయస్సు కంటే పెద్దదిగా కూడా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పుడు నిరూపించారు. దీని గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనం బతికే జీవితంలో దాదాపు మూడోవంతు నిద్రకే కేటాయిస్తాం. చాలామంది నిద్ర అంటే టైమ్ వేస్ట్ అనుకుంటారు. కానీ నిద్ర అనేది మన శరీరానికి, ముఖ్యంగా మన మెదడుకు ఎంత ముఖ్యమో చెప్పడానికి తాజాగా ఒక పెద్ద అధ్యయనం జరిగింది. యూకేలో 27,000 మందిపై చేసిన ఈ పరిశోధనలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఎవరైతే సరిగా నిద్రపోవడం లేదో వారి మెదడు వారి వయస్సు కంటే ముసలిదిగా కనిపిస్తోందట
నిద్ర అంటే మెదడుకు ‘ఛార్జింగ్’
నిద్ర అంటే కేవలం కళ్లు మూసుకోవడం కాదు. ఆ సమయంలో మన శరీరంలో రిపేర్ పనులు జరుగుతాయి. మెదడు అయితే రోజంతా నేర్చుకున్న విషయాలను క్లీన్ చే, సెట్ చేసుకుంటుంది. ఇది మెదడుకు రీసెట్ బటన్ లాంటిది. ఈ పని సరిగా జరగకపోతే మెదడుకు అలసట వస్తుంది.
27 వేల మందిపై పరిశోధన
40 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న 27 వేల మంది నిద్ర అలవాట్లు, వారి మెదడు స్కాన్‌లను సైంటిస్టులు పోల్చారు. నిద్ర సరిగా లేని వారి మెదడు వేగంగా వృద్ధాప్యం చెందుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల భవిష్యత్తులో మతిమరుపు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు.
మెదడు వయసు పెరుగుతోందని ఎలా తెలుసు?
ముసలితనం వస్తే శరీరంపై ముడతలు పడినట్లే, మెదడు లోపల కూడా మార్పులు వస్తాయి. శాస్త్రవేత్తలు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో, మెదడులోని చిన్న చిన్న కణాల సాంద్రత, రక్తనాళాల ఆరోగ్యాన్ని కొలిచి దాని జీవ వయస్సు ఎంత ఉందో తెలుసుకున్నారు. తక్కువ నిద్ర ఉన్నవారి మెదడు పాతదిగా ఉన్నట్లు తేలింది.
నిద్ర సరిగా లేకపోతే ఇమ్యూనిటీ తగ్గుతుంది!
సైంటిస్టులు రక్తం పరీక్షించి చూసినప్పుడు, సరిగా నిద్రపోని వారి శరీరంలో వాపు స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ వాపు అనేది మెదడు త్వరగా వృద్ధాప్యం చెందడానికి దాదాపు 10శాతం కారణం అవుతోందట.
మీ నిద్రను మెరుగుపరుచుకోవడానికి 3 చిట్కాలు
మీ మెదడును యవ్వనంగా, చురుకుగా ఉంచుకోవాలంటే ఈ మూడు సింపుల్ చిట్కాలు పాటించండి:
పడుకునే ముందు: కాఫీ, టీ, ఆల్కహాల్ తాగకండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ చూడటం మానేయండి.
వాతావరణం: మీరు పడుకునే గదిని చీకటిగా, ప్రశాంతంగా ఉంచుకోండి.
క్రమశిక్షణ: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోండి.
ఈ చిన్న మార్పులు మీ నిద్ర నాణ్యతను పెంచి, మీ మెదడును చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




