Pumpkin: గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!

గుమ్మడి కాయను ఎక్కువగా పూర్వం ఉపయోగించేవారు. గుమ్మడి కాయతో చేసే వంటలన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. గుమ్మడికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క గుమ్మడి కాయతో ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి దీంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Pumpkin: గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
Pumpkin
Follow us

|

Updated on: Nov 05, 2024 | 7:08 PM

ఈ జనరేషన్‌లో కంటే మీ ఇంట్లో ఉండే పెద్దలను అడగండి. గుమ్మడికాయ కూరకు ఉండే రుచి అంతా ఇంతా ఉండదు. తిన్న వారు ఆహా అనాల్సిందే. అందులో బ్రాహ్మణుల స్టైల్‌లో వండితే ఇక చెప్పాల్సిన పని లేదు. అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. గుమ్మడి కాయను ఇప్పుడంటే పెద్దగా ఎవరూ తినడం లేదు. కానీ పూర్వంలో ఇంట్లో ఖచ్చితంగా గుమ్మడి కాయ పాదు ఉండేది. గుమ్మడి పండులో ఉండే పోషకాలు చాలా ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు అనేవి సమృద్ధిగా లభిస్తాయి. శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు ఈ గుమ్మడి కాయ ఎంతో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా గుమ్మడి కాయ విత్తనాలను తీసుకుంటున్నారు. శరీర ఆరోగ్యమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా ఈ గుమ్మడి కాయ ఎంతో చక్కగా పని చేస్తుంది. మరి గుమ్మడి కాయ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి:

గుమ్మడి కాయ తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పుష్కలంగా పని చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో సహాయ పడుతుంది. రోగ నిరోధక శక్తి సరిగ్గా పని చేస్తే రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

చర్మ ఆరోగ్యం:

చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా గుమ్మడి కాయ తినొచ్చు. ఇందులో ఇందులో విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. వేసవిలో తింటే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్‌కు చెక్:

గుమ్మడి పండు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో గుమ్మడి కాయలో పోషకాలు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తాయి.

కాలేయ ఆరోగ్యం:

శరీరంలో ముఖ్య భాగాల్లో కూడా కాలేయం ఒకటి. ఇది ఆరోగ్యంగా పనిచేయాలంటే మంచి ఫుడ్స్ తీసుకోవాలి. గుమ్మడి పండు కాలేయాన్ని ఆరోగ్య ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీ లివర్, లివర్ క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది.

బీపీ కంట్రోల్:

గుమ్మడి కాయ తినడం వల్ల రక్త పోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఇది తింటే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌