AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kids: చలికాలం చిన్నారులు వ్యాధుల బారిన పడొద్దంటే.. పాలలో ఇవి కలిపివ్వండి..

చలికాలం వచ్చిందంటే చాలు వ్యాధులు చుట్టుముడుతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే చిన్న పిల్లలకు పాలలో కొన్ని రకాల పదార్థాలను కలిపి ఇవ్వడం వల్ల చలికాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Kids: చలికాలం చిన్నారులు వ్యాధుల బారిన పడొద్దంటే.. పాలలో ఇవి కలిపివ్వండి..
Kids Health
Narender Vaitla
|

Updated on: Nov 05, 2024 | 6:17 PM

Share

చలికాలం ప్రారంభమైంది. క్రమంగా వాతావరణం చల్లబడుతోంది. సాయంత్రం 5 గంటలకే చలి ప్రారంభమవుతోంది. చలికాలం వచ్చిందంటే చాలు చిన్నారులు అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువవుతాయి. అందుకే చలికాలం చిన్నారుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సహజ చిట్కాలను పాటించడం ద్వారా చిన్నారుల్లో చలికాలంలో వచ్చే సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. పాలల్లో కొన్ని పదార్థాలను కలుపుకొని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* పాలలో చక్కెరకు బదులుగా బెల్లం వేసి ఇవ్వాలని సూచిస్తున్నారు. సాధారణంగా చిన్నారులకు చక్కెర వేసి ఇవ్వడం వల్ల దగ్గు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే పాలలో బెల్లం వేసి ఇస్తే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు.

* పాలలో కుంకుమపువ్వు వేసి చిన్నారులకు ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా రెగ్యులర్‌గా ఇస్తే.. జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

* పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు చిన్నారులు తరచూ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు.

* చిన్నారుల్లో జీర్ణ శక్తి పెరిగి. రోగనిరోధక శక్తి మెరుగవ్వాలంటే బాదం పప్పు పొడిని పాలలో కలిపి ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వ్యాధుల నుంచి కాపాడుతుంది.

* పిల్లల ఆరోగ్యానికి ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఐరన్, విటమిన్ బి16 పుష్కలంగా ఉంటాయి. దీన్ని పాలలో కలిపి పిల్లలకు ఇస్తే వారి శరీరంలో ఐరన్ లోపం ఏర్పడదు, జీర్ణక్రియకు ఆటంకం కలగదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..