AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulagam: కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..

హెల్దీ బ్రేక్ ఫాస్ట్ అండ్ డిన్నర్ చేయాలి అనుకునేవారు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెసిపీనే పులగం. పెసరపప్పు వేసి చేసే ఈ పులగం చాలా కమ్మగా ఉంటుంది. చిన్న పిల్లలకు పెడితే బలంగా ఉంటారు..

Pulagam: కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
Pulagam
Chinni Enni
|

Updated on: Nov 05, 2024 | 8:24 PM

Share

కార్తీక మాసంలో చాలా మంది శివుడిని ఎంతో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో ఆ నెల అంతా నాన్ వెజ్ తినడం మానేస్తారు. కేవలం వెజిటేబుల్స్ తో చేసిన ఆహారం మాత్రమే తీసుకుంటారు. అయితే వెరైటీ ఆహారం తినాలి అనుకునేవారు ఇలాంటి రెసిపీ తయారు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో స్పెషల్‌గా ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ పులగం ట్రై చేయండి. ఇది రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు, పెద్దలకు కూడా చాలా మంచిది. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే, కొన్ని రకాల పదార్థాలతోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ పులగం ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పులగం తయారీకి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, పెసరపప్పు, ఉప్పు, తాళింపు దినుసులు, మిరియాలు, పచ్చి మిర్చి, టమాటా, ఉల్లిపాయ, ఆయిల్, నెయ్యి.

పులగం తయారీ విధానం:

ముందుగా బియ్యం పెసరపప్పును శుభ్రంగా కడిగి ఓ గంట సేపు నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసి.. తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చి మిర్చి, మిరియాలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ నెక్ట్స్ పచ్చి మిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు కూడా వేసి కాసేపు వేయించాక.. కొత్తిమీర కూడా వేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఉప్పు, పసుపు, నానబెట్టిన బియ్యం, పెసర పప్పు కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి సర్వ్ చేసుకోవడమే. కావాలంటే నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే పులగం సిద్ధం. ఇది వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌గా, డిన్నర్‌గా, లంచ్‌గా కూడా తినవచ్చు.

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.