AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. అమేజింగ్.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

పచ్చి అరటిపండ్లు పోషకాల నిధి. ఇందులో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పండిన అరటిపండ్ల కంటే తక్కువ చక్కెరతో, అధిక ఫైబర్‌తో ఉంటాయి. రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Shaik Madar Saheb
|

Updated on: Nov 06, 2024 | 5:59 AM

Share
అరటిపండు చాలా పోషకరమైన పండు .. అందుకే, దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. శరీరానికి ఎన్నో ప్రయోనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. మీరు అరటిపండును కొనడానికి చాలా డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అందుబాటు ధరల్లోనే రకరకాల అరటిపండ్లు సులువుగా దొరుకుతాయి.. ఒక పండిన అరటిపండులో 22 శాతం కార్బోహైడ్రేట్ ఉంటుంది.. ఇంకా డైటరీ ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్లు B6, C ఎక్కువగా ఉంటాయి. అయితే.. పచ్చి అరటిపండులోకి ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్య నిపునులు చెబుతున్నారు. అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యంతోపాటు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6
పచ్చి అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటాయి. పండిన అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది.. ఇది రక్తపోటును నిర్వహిస్తుంది.. ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు.. సమస్యలను నియంత్రిస్తుంది.

2 / 6
పచ్చి అరటిపండ్లు పసుపు అరటిపండ్ల కంటే తక్కువ చక్కెరను కలిగి ఉంటాయి.. అందుకే, అవి తక్కువ తీపిగా ఉంటాయి. అదనంగా, పచ్చి అరటిపండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. పచ్చి అరటిపండ్లు దాదాపు 30 గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రభావవంతంగా ఉంటాయి.

3 / 6
పచ్చి అరటిపండ్లలో ప్రీబయోటిక్ ప్రభావాలను కలిగి ఉండే బౌండ్ ఫినోలిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంచి బ్యాక్టీరియా మన కడుపు - చిన్న ప్రేగులను చేరుకోవడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

4 / 6
పచ్చి అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా క్యాన్సర్ - ఆక్సీకరణ నష్టం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 6
మనలో చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు.. డైటింగ్, జిమ్ లలో చెమటోడ్చినప్పటికీ.. విజయవంతం కాలేరు. అటువంటి పరిస్థితిలో మీరు పచ్చి అరటిపండును తింటే మీకు చాలా ఫైబర్ లభిస్తుంది.. దీంతో మీకు తక్కువ కేలరీలు లభిస్తాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది.. తక్కువ తింటారు.. ఇలా క్రమంగా బరువు తగ్గొచ్చు..

6 / 6