AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో ఐదో స్థానం దక్కించుకున్న పరోటా..! దీని స్పెషల్ ఏంటో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా పరోటాకు గుర్తింపు. పరోటా వంటి వంటకాలు ఇప్పుడు దేశం బయట కూడా గుర్తింపు పొందుతున్నాయి. పరోటా తినడానికి మృదువుగా పొరలతో ఉండేలా ఉంటుంది. దీనిని మైదా పిండితో తయారు చేస్తారు. స్పైసీ చికెన్, మటన్ గ్రేవీలతో కలిపి తింటే అదిరిపోయే రుచి ఉంటుంది.

ప్రపంచంలో ఐదో స్థానం దక్కించుకున్న పరోటా..! దీని స్పెషల్ ఏంటో తెలుసా..?
World Loves Indian Parotta
Prashanthi V
|

Updated on: Apr 12, 2025 | 10:44 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా పరోటాకు గుర్తింపు.. పరోటా దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన లేయర్డ్ బ్రెడ్. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టేస్ట్ అట్లాస్ అనే ప్రముఖ ఫుడ్ వెబ్‌సైట్ ప్రపంచంలోని టాప్ 100 వీధి ఆహారాల్లో పరోటాను ఐదవ స్థానంలో ఉంచింది. తమిళనాడు, కేరళ, శ్రీలంక వంటి ప్రాంతాల్లో పరోటా చాలా ప్రాచుర్యం పొందింది. దీన్ని మైదా పిండి, ఉప్పు, కొంచెం చక్కెర, నూనెతో తయారు చేస్తారు. ఇది లేయర్‌లతో కూడిన బ్రెడ్‌లా ఉంటుంది. వీధుల్లో విక్రయించే పరోటాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చనా లేదా మసాలా గ్రేవీతో దీన్ని ఎక్కువగా వడ్డిస్తారు.

టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని ఉత్తమ వీధి ఆహారాల జాబితాలో పరోటా ఐదవ స్థానంలో నిలిచింది. ఇది భారతదేశపు రుచుల వైవిధ్యాన్ని చూపుతుంది. పరోటా వంటి వంటకాలు ఇప్పుడు దేశం బయట కూడా గుర్తింపు పొందుతున్నాయి. మలేషియా రోటీ కనై మొదటి స్థానంలో నిలిచింది. చైనీస్ గుటీ రెండవ స్థానంలో ఉంది. ఫిలిప్పీన్ టోర్టా మూడవ స్థానంలో, వియత్నాం బాన్ మి నాలుగవ స్థానంలో ఉన్నాయి. పరోటా తరువాత మెక్సికన్ టాకోస్ ఆరవ స్థానంలో ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన కయా టోస్ట్ ఏడవ స్థానంలో ఉంది. ఈ జాబితా ప్రజల అభిప్రాయాలు, ఆహార విమర్శకుల విశ్లేషణ ఆధారంగా రూపొందించారు.

పరోటా తినడానికి మృదువుగా పొరలతో ఉండేలా ఉంటుంది. దీనిని మైదా పిండితో తయారు చేసి నూనెలో వేయిస్తారు. స్పైసీ చికెన్, మటన్ గ్రేవీలతో కలిపితే అదిరిపోయే రుచి వస్తుంది. తమిళనాడు, కేరళ వీధుల్లో ఇది నిత్యం కనిపించే చిరుతిండి. ఇలాంటి గుర్తింపులు భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకువస్తున్నాయి. వీధి ఆహారం మన ప్రాంతాల ప్రత్యేకతను చూపుతుంది. పరోటాను ఎలా తయారు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

4 పరోటాలకు కావాల్సిన పదార్థాలు

  • మైదా పిండి – 2 కప్పులు
  • ఉప్పు – ¾ టీస్పూన్
  • చక్కెర – 1 టీస్పూన్
  • నూనె – 2 టేబుల్ స్పూన్లు
  • నీరు – అవసరమైనంత

తయారీ విధానం

ఒక్క గిన్నె తీసుకోని అందులో మైదా పండి, ఉప్పు, చక్కెరను వేసి కలిపి.. గోరువెచ్చని నీటితో పిండి మొత్తాన్ని మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంపై ఒక టేబుల్ స్పూన్ నూనె రాసి తడి బట్టతో కప్పి కనీసం రెండు గంటల పాటు పక్కకు పెట్టాలి. తరువాత ఈ పిండిని నాలుగు బంతులుగా చేసుకొని ప్రతి బంతిని సన్నగా పలుచగా ఒత్తి చుట్టాలి. చుట్టిన పిండిని స్పైరల్‌ ఆకారంలో మడిచి మళ్లీ నెమ్మదిగా ఒత్తాలి. ఇప్పుడు స్టౌవ్ ఆన్ చేసి దానిపై టావా పెట్టి బాగా వేడి అయ్యాక అందులో కొద్దిగా నూనె వేసి పరోటాను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు సాధారణ మంటపై సమంగా కాల్చాలి. ఇంతే సింపుల్ పరోటా రెడీ అయ్యింది.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ