Mulakkada Chicken Curry: ఆంధ్రా స్టైల్ ములక్కాడ కోడి కూర.. రుచి చూస్తే అస్సలు వదలరు..
చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్ వండారంటే ఒక పట్టు పడుతూ ఉంటారు. అయితే కేవలం చికెన్ మాత్రమే కాకుండా ఇందులో కొన్ని రకాల పదార్థాలు కలిపి వండితే మరింత రుచిగా ఉంటుంది. పూర్వం ఎక్కువగా ఇలా వెజిటేబుల్స్ మిక్స్ చేసి వండుతూ ఉంటారు. ఇలా ములక్కాడ కోడి కూర కూడా ఒకటి..

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్ వండారంటే ఒక పట్టు పడుతూ ఉంటారు. అయితే కేవలం చికెన్ మాత్రమే కాకుండా ఇందులో కొన్ని రకాల పదార్థాలు కలిపి వండితే మరింత రుచిగా ఉంటుంది. పూర్వం ఎక్కువగా ఇలా వెజిటేబుల్స్ మిక్స్ చేసి వండుతూ ఉంటారు. ఇలా ములక్కాడ కోడి కూర కూడా ఒకటి. ఆంధ్రాలో ఈ కూర చాలా ఫేమస్. ములక్కాడ వేయడం వల్ల చికెన్ మరింత రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ చికెన్ ములక్కాడ కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ములక్కాడ కోడి కర్రీకి కావాల్సిన పదార్థాలు:
ములక్కాడ, చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్.
ములక్కాడ కోడి కర్రీ తయారీ విధానం
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా పెరుగు వేసి అన్నీ కలిపి కలిపి కనీసం ఓ గంట సేపు అయినా మ్యారినేట్ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టినా పర్వాలేదు. ఆ తర్వాత ములక్కాడలను కోసి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేశాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత చికెన్ వేసి ఓ పావు గంట సేపు ఫ్రై చేయాలి.
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. ఆ నెక్ట్స్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, వేయించిన ములక్కాడలు అన్నీ వేసి మరో పది నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నీళ్లు వేసి బాగా ముక్క ఉడికేంత వరకు ఉడికించాలి. కర్రీ దగ్గర పడి దించే ముందు కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ములక్కాడ కోడి కర్రీ సిద్ధం. ఈ కర్రీ వేడి వేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.








