Egg Salad: ఎంతో టేస్టీ హెల్దీ ఎగ్ సలాడ్.. ఈజీగా ఇలా చేయవచ్చు..
సులభంగా తయారు చేసే వాటిల్లో ఎగ్ సలాడ్ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం ఒక్క కప్పు తిన్నా చాలు. కడుపు ఫుల్లుగా నిండిపోతుంది..

సలాడ్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉపయోగించేవి సులభంగా జీర్ణం అయ్యే పదార్థాలను ఉపయోగిస్తారు. సలాడ్స్‌ని ఎన్నో రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఇలా వీటిల్లో సులభంగా తయారు చేసే వాటిల్లో ఎగ్ సలాడ్ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం ఒక్క కప్పు తిన్నా చాలు. కడుపు ఫుల్లుగా నిండిపోతుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇన్ని పోషకాలు నిండిన ఈ ఎగ్ సలాడ్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎగ్ సలాడ్‌కు కావాల్సిన పదార్థాలు:
ఉడకబెట్టిన గుడ్లు, క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యాప్సికమ్, ఉప్పు మిరియాల పొడి, మయోనీస్, సిరాకా.
ఎగ్ సలాడ్ తయారీ విధానం:
ముందుగా గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి.. సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యాప్సికమ్ వంటి కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే ఆవకాడో, టమాటా వంటివి మీకు నచ్చినవి కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. వీటన్నింటికీ ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, మిరియాల పొడి, మయోనీస్, సిరాకా వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఆలీవ్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చు.
అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ సలాడ్ సిద్ధం. ఈ సలాడ్ నేరుగా కూడా తినేయవచ్చు. అలా తినలేని వాళ్లు బ్రెడ్‌ని బటర్ లేదా నెయ్యితో కాల్చుకుని వాటి మధ్యలో సలాడ్ ఉంచి తినవచ్చు. ఇలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అయితే మీరు ఎంచుకున్న బ్రెడ్ మంచిది అవ్వాలి. చాలా సింపుల్‌గా ఈ సలాడ్ తయారైపోతుంది.








