Thotakura Garelu: తోట కూరతో వడలు.. టేస్ట్ వేరే లెవల్ అంతే..
తోట కూర ఆరోగ్యానికి చాలా మంచిది. తోట కూరతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు. తోటకూర తినడం వల్ల చాలా రకాల అనారోగ్య ససమ్యలను కూడా కంట్రోల్ చేయవచ్చు. తోట కూరతో కేవలం వంటలే కాకుండా స్నాక్స్ కూడా తయారు చేయవచ్చు. తోటకూరతో పూర్వం గారెలు వేసేవారు..

తోట కూర ఆరోగ్యానికి చాలా మంచిది. తోట కూరతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు. తోటకూర తినడం వల్ల చాలా రకాల అనారోగ్య ససమ్యలను కూడా కంట్రోల్ చేయవచ్చు. తోట కూరతో కేవలం వంటలే కాకుండా స్నాక్స్ కూడా తయారు చేయవచ్చు. తోటకూరతో పూర్వం గారెలు వేసేవారు. ఇది పూర్వ కాలం నుంచి వండే వంటకమే. అయితే ఈ గారెలు కాస్త గట్టిగా ఉంటాయి. కానీ చాలా రుచిగా ఉంటాయి. దక్షిణాదిలో చాలా ఫేమస్. వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. మరి ఈ తోట కూర గారెలు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తోటకూర గారెలకు కావాల్సిన పదార్థాలు:
తోటకూర, శనగ పప్పు, మినపప్పు, పచ్చి మిర్చి, ఉప్పు, అల్లం ముక్కలు, కొత్తిమీర, బేకింగ్ సోడా, ఆయిల్.
తోటకూర గారెలు తయారీ విధానం:
ఈ స్నాక్స్ తయారు చేయడం చాలా సింపుల్. ఇందుకు పెద్దగా కష్ట పడాల్సిన పని లేదు. తోట కూర మిగిలినప్పుడు, ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఈ గారెలు వేసుకోవచ్చు. ముందుగా శనగపప్పు, మినపప్పును వేడి నీళ్లు వేసి కనీసం మూడు గంటలు అయినా నానబెట్టాలి. పప్పులు బాగా నానిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు, అల్లం ముక్కలు, కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత తోట కూరను కూడా శుభ్రంగా కడిగి నీరంతా వడకట్టి నీటిలో వేయాలి. ఇప్పడు ఇందంతా బాగా కలపాలి. ఇదంతా కలిపిన తర్వాత చూసి నీటిని వేయాలి. లేదంటే పిండి బాగా జారుగా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను మరిగించాలి. ఇప్పుడు వడల మాదిరిగా వేసి రెండు వైపులా ఎర్రగా వేయించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే తోటకూర వడలు సిద్ధం.








