సొరకాయలో ఎక్కువ పీచు, ఎక్కువ నీటి శాతం నిండి ఉంటుంది. ఏడాది పొడవునా దీన్ని తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ఇదేంతో పోషకమైనది. కేలరీలు చాలా తక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు లేవు. అందుకే సొరకాయ బరువు తగ్గడానికి ఉత్తమమైనది. దీంతో పలుచని సూప్‌లతో పాటు పప్పు పులుసు పచ్చడి కూడా చేసుకుంటారు. అంతేకాకుండా, చేపలతో సొరకాయ, రొయ్యలతో సొరకాయ కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది.