Egg Ghee Roast: ఉడకబెట్టిన గుడ్లతో వెరైటీగా ఇలా చేయండి.. మళ్లీ ఇలానే చేయమంటారు..
గుడ్లతో చేసే ఎలాంటి రెసిపీ అయినా చాలా రుచిగా ఉంటుంది. గుడ్లతో ఎలాంటి రెసిపీలు అయినా తయారు చేసుకోవచ్చు. చాలా మందికి గుడ్లు అంటే చాలా ఇష్టం. గుడ్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. గుడ్లతో చాలా రకాల వెరైటీ రెసిపీలు ఇప్పటివరకూ చూశాం. ఇప్పుడు చెప్పబోయే ఈ కర్రీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కర్రీని పులావ్, రోటీలు, చపాతీలు, అన్నంలోకి ఎలా తిన్నా బావుంటుంది. కోడి గుడ్లు ఉడకబెట్టి చేసే ఈ కర్రీ..

గుడ్లతో చేసే ఎలాంటి రెసిపీ అయినా చాలా రుచిగా ఉంటుంది. గుడ్లతో ఎలాంటి రెసిపీలు అయినా తయారు చేసుకోవచ్చు. చాలా మందికి గుడ్లు అంటే చాలా ఇష్టం. గుడ్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. గుడ్లతో చాలా రకాల వెరైటీ రెసిపీలు ఇప్పటివరకూ చూశాం. ఇప్పుడు చెప్పబోయే ఈ కర్రీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కర్రీని పులావ్, రోటీలు, చపాతీలు, అన్నంలోకి ఎలా తిన్నా బావుంటుంది. కోడి గుడ్లు ఉడకబెట్టి చేసే ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీని రుచి చూస్తే అస్సలు వదిలి పెట్టరు. కోడిగుడ్లతో చేసే ఈ ఘీ రోస్ట్ చాలా బావుంటుంది. మరి ఈ ఎగ్స్ ఘీ రోస్ట్ ఎలా చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎగ్స్ ఘీ రోస్ట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:
గుడ్లు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకులు, టమాటాలు, పసుపు, కారం, ఉప్పు, నెయ్యి, ఆయిల్.
ఎగ్స్ ఘీ రోస్ట్ కర్రీ తయారీ విధానం:
ముందుగా గుడ్లలో ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. ఇందులో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి వేయించి.. చల్లారాక మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయేంత వరకూ వేయించి.. పసుపు, కారం, ఉప్పు, పక్కన పెట్టిన మసాలా పౌడర్, కరివేపాకులు వేసి ఓ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలను పేస్టు వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసి ఉడికించాలి. కర్రీ దగ్గర పడుతున్న సమయంలో గుడ్లు కూడా కలిపి దింపేయాలని. చివరిలో కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్స్ ఘీ రోస్ట్ కర్రీ సిద్ధం. ఈ కర్రీని వేటితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ ఈ టేస్టీ కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.








