Vankaya Nuvvula pachhadi: వంకాయ నువ్వుల పచ్చడి ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..
వంకాయతో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. వంకాయ చాలా మందికి ఫేవరేట్. ఎంతో ఇష్ట పడి మరీ తింటారు. అదే విధంగా వంకాయతో చేసే పచ్చళ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. అందులో ఈ వంకాయ నువ్వుల పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఈ పచ్చడిని అన్నంలోకి తిన్నా.. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే..

వంకాయతో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. వంకాయ చాలా మందికి ఫేవరేట్. ఎంతో ఇష్ట పడి మరీ తింటారు. అదే విధంగా వంకాయతో చేసే పచ్చళ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. అందులో ఈ వంకాయ నువ్వుల పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఈ పచ్చడిని అన్నంలోకి తిన్నా.. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే.. అస్సలు వదిలి పెట్టారు. అంత కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడి తినడం ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఇందులో నువ్వులు ఉపయోగిస్తారు కాబట్టి. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ వంకాయ నువ్వుల పచ్చడిని ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వంకాయ నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
వంకాయలు, నువ్వులు, ఉప్పు, పచ్చి మిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటాలు, తాలింపు దినుసులు, ఆయిల్.
వంకాయ నువ్వుల పచ్చడి తయారీ విధానం:
ముందుగా వంకాయలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి.. కుక్కర్‌లో వేసి ఉడికించాలి. కనీసం మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించు కోవాలి. ఆవిరి తగ్ిపోయాక కుక్కర్ మూత విజిల్ తీయాలి. ఇప్పుడు వంకాయ మీద ఉండే తొక్కను తీసేయండి. ఆ తర్వాత ఇప్పుడు వంకాయ గుజ్జును.. మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే రోటిలో అయినా వేసి దంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో నువ్వులు వేసి వేయించుకోవాలి. వాటిని కూడా మిక్సీలో వేసి బాగా దంచి.. పొడిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.
ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, సన్నగా తరిగిన టమోటాలను వేసి.. మెత్తగా ఇగురులా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత వంకాయ పేస్టును, నువ్వుల పొడిని ఇందులో వేసి.. బాగా కలుపు కోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి.. పోపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయ నువ్వుల పచ్చడి సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చతుంది.








