AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jonna Rotte: జొన్న రొట్టె తింటే ఈ వ్యాధులన్నీ తగ్గించుకోవచ్చు..

జొన్న రొట్టెలను ఈ మధ్య కాలంలో ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఈ రోటీలను రోజూ తినడం వల్ల శరీరానికి చాలా మేలు. పలు ఆరోగ్యకరమైన పోషకాలు అన్నీ అందుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ జొన్న రొట్టెలో మనకు లభిస్తాయి. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలతో బాధ పడేవారికి ఈ రోటీలు బెస్ట్. ఇందులో అధిక మోతాదులో ఫైబర్, ప్రోటీన్ లభిస్తాయి. అంతే కాకుండా విటమిన్ బి..

Jonna Rotte: జొన్న రొట్టె తింటే ఈ వ్యాధులన్నీ తగ్గించుకోవచ్చు..
Jonna Rotte
Chinni Enni
|

Updated on: Oct 15, 2024 | 3:23 PM

Share

జొన్న రొట్టెలను ఈ మధ్య కాలంలో ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఈ రోటీలను రోజూ తినడం వల్ల శరీరానికి చాలా మేలు. పలు ఆరోగ్యకరమైన పోషకాలు అన్నీ అందుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ జొన్న రొట్టెలో మనకు లభిస్తాయి. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలతో బాధ పడేవారికి ఈ రోటీలు బెస్ట్. ఇందులో అధిక మోతాదులో ఫైబర్, ప్రోటీన్ లభిస్తాయి. అంతే కాకుండా విటమిన్ బి కాంప్లెక్ట్స్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి అధిక పరిమాణంలో ఉంటాయి. ఇన్ని లాభాలు ఉన్న ఈ రొట్టెను తింటే ఎలాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బరువు:

జొన్నె రొట్టెలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్యల నుంచి త్వరగా బయట పడొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా ఈ చపాతీలను మీ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. కాబట్టి తక్కువగా తీసుకున్నా కడుపు నిండుతుంది. జీవక్రియను మెరుగు పరుస్తుంది.

షుగర్ వ్యాధి రాదు:

జొన్న రోటీలను తింటే షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. ఎందుకంటే జొన్న చపాతీలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరగవు. అలాగే డయాబెటీస్‌తో బాధ పడేవారు కూడా ఈ రొట్టెలను తింటే షుగర్ పెరగకుండా కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి అనుకునేవారు ప్రతిరోజూ సాయంత్రం తినడం మంచిది.

ఇవి కూడా చదవండి

గుండె సమస్యలు దూరం:

జొన్న చపాతీల్లో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి. అదే విధంగా రక్త పోటు పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

బలంగా ఎముకలు:

జొన్న రొట్టెల్లో క్యాల్షియం, ఫాస్పరస్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను, దంతాలను బలంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. అలాగే అన్ని రకాల ఎముకల సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయ పడుతుంది.

చర్మ ఆరోగ్యం:

జొన్నల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కణాలను ఆఱోగ్యంగా ఉంచుతాయి. చర్మంపై ఉండే మలినాలు, మృత కణాలను తొలగించి.. చర్మం కాంతివంతంగా.. సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..