AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? ఈ 4 వ్యాయామాలు మీ కోసమే

రోజంతా కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా? ఈ అలవాటు వల్ల మెడ, నడుము మరియు భుజాల నొప్పులు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే చింతించకండి! ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొంది, మీ వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచేందుకు నిపుణులు సూచించిన 4 సులభమైన వ్యాయామాల గురించి వివరంగా తెలుసుకుందాం.

రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? ఈ 4 వ్యాయామాలు మీ కోసమే
Desk Job Strains.jpg
Nikhil
|

Updated on: Jun 08, 2026 | 7:36 PM

Share

నేటి డిజిటల్ యుగంలో చాలామంది ఉద్యోగ బాధ్యతలు ల్యాప్‌టాప్‌లు లేదా స్మార్ట్‌ఫోన్‌ల చుట్టూనే తిరుగుతుంటాయి. గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల మెడ నొప్పి, నడుము నొప్పి, భుజాలు పట్టేయడం, హిప్ పెయిన్ వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. స్క్రీన్ల వైపు చూస్తూ తల ముందుకు వంచి ఉండటం వల్ల వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనిని మనం పూర్తిగా నివారించలేకపోయినా, కొన్ని ప్రత్యేక వ్యాయామాల ద్వారా ఆ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని కల్ట్ ఫిట్ సహ-వ్యవస్థాపకుడు రిషబ్ తెలాంగ్ సూచిస్తున్నారు.

నొప్పిని తగ్గించే వ్యాయామాలు

  • థొరాసిక్ రొటేషన్ స్ట్రెచ్ : మోకాళ్లు, చేతులపై నిలబడి, ఒక చేతిని నేలపై ఉంచి, మరొక చేతిని వెనుక ఉంచి పైకి రొటేట్ చేయాలి. ఇది ఛాతీని తెరిచి, వెన్నెముక కదలికను మెరుగుపరచడమే కాకుండా మెడ, భుజాల బిగుతును తగ్గిస్తుంది.
  • థ్రెడ్ ది నీడిల్ స్ట్రెచ్ : టేబుల్ టాప్ పొజిషన్‌లో ఒక చేతిని మరొక చేయి కింద నుండి పంపి భుజాన్ని నేలకు తాకించాలి. తిరిగి అదే చేతిని పైకి ఎత్తి ఛాతీని తెరవాలి. ఇది మెడ, భుజాలు మరియు ఎగువ వెన్నెముకలో పేరుకుపోయిన టెన్షన్‌ను విడుదల చేస్తుంది.
  • ఓపెన్ బుక్ స్ట్రెచ్: ఒక పక్కకు తిరిగి పడుకుని, ఒక మోకాలు కింద దిండును ఉంచి, మీ పై చేతిని పుస్తకం తెరిచినట్లుగా వెనుకకు చాచాలి. ఇది టైట్ ఛాతీ కండరాలను స్ట్రెచ్ చేసి, మెడ, భుజాల బిగుతును ఈజ్ చేస్తుంది.
  • వై-టి-డబ్ల్యు-ఐ ఎక్స్‌టెన్షన్స్: నేలపై బోర్లా పడుకుని చేతులను Y, T, W, I ఆకారాల్లో నెమ్మదిగా కదిలించాలి. ఇది ఎగువ వెన్నుముక, భుజాలు మరియు శరీర భంగిమను మెరుగుపరిచే కండరాలను బలోపేతం చేస్తుంది.

చిన్న మార్పులు.. పెద్ద ఫలితాలు

ఈ వ్యాయామాలు చేయడానికి ప్రత్యేకమైన జిమ్ పరికరాలు అక్కర్లేదు. వీటిని రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకుంటే కండరాల బలం పెరగడమే కాకుండా, పని చేసేటప్పుడు మరింత ఉత్సాహంగా ఉండవచ్చు. గంటల కొద్దీ ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు కీళ్లు, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే కనీసం గంటకు ఒకసారి చిన్నపాటి విరామం తీసుకుని ఈ వ్యాయామాలు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే వెన్నెముక సంబంధిత సమస్యలను నివారించవచ్చు. మీ శరీరం మీ అతిపెద్ద సంపద, దానిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఈ చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని సొంతం చేసుకోండి!

Follow Us
బిగ్ షాక్ : రూ. 54 వేల కోట్ల ఆస్తులున్నా "బ్యాంక్ క్లోజ్"...!
బిగ్ షాక్ : రూ. 54 వేల కోట్ల ఆస్తులున్నా
కార్తీక సోమవారం వ్రత మహిమ.. కుక్కగా పుట్టిన మహిళకు కైలాస ప్రాప్తి
కార్తీక సోమవారం వ్రత మహిమ.. కుక్కగా పుట్టిన మహిళకు కైలాస ప్రాప్తి
"ఆకాశంలో ఒక తార" టీంకి మెగా కంగ్రాట్స్.. చిరు-చరణ్ వీడియో వైరల్ !
Video: టీచర్‌తో డ్యాన్స్ వైరల్.. 'జెన్ జీ టీచర్' అంటూ ప్రశంసలు!
Video: టీచర్‌తో డ్యాన్స్ వైరల్.. 'జెన్ జీ టీచర్' అంటూ ప్రశంసలు!
గొంతులో పాము ఉన్నట్లు కల వస్తోందా? అసలు అర్థం ఇదే!
గొంతులో పాము ఉన్నట్లు కల వస్తోందా? అసలు అర్థం ఇదే!
అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్..
అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్..
లోక్‌సభలో నెంబర్ గేమ్.. ఎన్డీఏ పక్కా వ్యూహం..
లోక్‌సభలో నెంబర్ గేమ్.. ఎన్డీఏ పక్కా వ్యూహం..
హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో.. 130 సంస్థల అద్భుత ప్రదర్శనలు!
హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో.. 130 సంస్థల అద్భుత ప్రదర్శనలు!
తిరుమల శ్రీవారి గర్భగుడిలో 5 విగ్రహాలు ఉన్నాయని తెలుసా? పంచబేరాల
తిరుమల శ్రీవారి గర్భగుడిలో 5 విగ్రహాలు ఉన్నాయని తెలుసా? పంచబేరాల
పసుపు రంగులోకి మారిన దిండ్లకు ఇలా చేస్తే కొత్త లుక్!
పసుపు రంగులోకి మారిన దిండ్లకు ఇలా చేస్తే కొత్త లుక్!