చేప కళ్లలో అంత పవర్ ఉందా.? తింటే ఏమవుతుందో తెలుసా?
08 jun 2026
Anand T
చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందిరికి తెలుసు. కానీ చేపకళ్లు తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? అయితే ఇక్కడ తెలుసుకోండి
చేపలో ఉన్న ప్రతి పార్ట్ మన ఆరోగ్యానికి ఏదో విదంగా మేలు చేస్తుంది. చేపల కళ్ళలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.
చేప కళ్లలో ఉండే పోషకాలు రక్తపోటును తగ్గించడంలో, గుండె లయను క్రమబద్ధీకరించడానికి దోహదపడతాయి. బీపీ ఉన్నవారికి ఇవి చాలా మంచివి
అంతే కాదు చేపల కళ్ళలోని పోషకాలు మెదడు కణాల అభివృద్ధికి, వాటి చురుకుదనానికి ఎంతగానో తోల్పడుతాయి.
వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, అలాగే అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
చేపల కళ్ళలో విటమిన్-A సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, వయసు పెరగడం వల్ల వచ్చే చూపు మందగించడాన్ని నివారిస్తుంది.
అయితే పెద్ద పెద్ద సముద్రపు చేపల కళ్ళలో పాదరసం ఉండే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద చేపల కళ్ళను తినకపోవడమే మంచింది.ఆరోగ్య పరంగా చూస్తే పెద్ద చేపల కంటే చిన్న చిన్న చేపల కళ్ళను తినడమే అత్యంత సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.