AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ ప్రాంతంలో ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక 25 ఏళ్ల యువ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లింపులో జాప్యం కావడంతో నిర్వాహకులు నిరంతరం ఒత్తిడి, వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

Hyderabad: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య
Loan App Scam
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 08, 2026 | 7:15 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 8: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు మరో ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మృతురాలు శివ దానపు దేవనందిని (25) స్వస్థలం కృష్ణా జిల్లా గణపవరం గ్రామం. 2022 నవంబర్ 8న పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన తిరుమల రేవంత్ కుమార్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం దంపతులు హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ పరిధిలో ఉన్న జేజే నగర్‌లోని SSB క్లాసిక్ అపార్ట్‌మెంట్లో గత మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో రేవంత్ కుమార్ పనిమీద బయటకు వెళ్లాడు. అనంతరం పలుమార్లు భార్యకు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఆందోళన చెందిన అతను ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని దేవనందిని వేలాడుతూ కనిపించింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి మొబైల్ ఫోన్‌ను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో దేవనందిని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు, ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు నిరంతరం ఒత్తిడి, వేధింపులకు గురిచేసినట్లు గుర్తించారు. ఈ మానసిక ఒత్తిడిని భరించలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి భీమవరపు వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్ నిర్వాహకుల పాత్ర, వేధింపుల స్వరూపంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవలి కాలంలో అక్రమ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి, అనంతరం అధిక వడ్డీలు, బెదిరింపులు, వ్యక్తిగత వివరాల దుర్వినియోగం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా వేధింపుల కారణంగా అనేక మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అక్రమ లోన్ యాప్‌ల వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను లేదా సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

నోట్: ఆత్మహత్య ఆలోచనలు, తీవ్ర మానసిక ఒత్తిడి ఎదురైతే వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం. అత్యవసర పరిస్థితిలో స్థానిక అత్యవసర సేవలు లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.

Follow Us
వేడివేడి అన్నం, రోటీల్లోకి అదిరిపోయే హోటల్ స్టైల్ ఆలూ ఎగ్ కుర్మా
వేడివేడి అన్నం, రోటీల్లోకి అదిరిపోయే హోటల్ స్టైల్ ఆలూ ఎగ్ కుర్మా
లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య
లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య
చిన్న వయసులో క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టాప్ 5 ప్లేయర్లు వీళ్లే
చిన్న వయసులో క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టాప్ 5 ప్లేయర్లు వీళ్లే
పిల్లలు ఎత్తు పెరగడానికి అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు..
పిల్లలు ఎత్తు పెరగడానికి అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు..
రెండు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన
రెండు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన
ఏ ఖర్చు లేని ఈ చిట్కాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం
ఏ ఖర్చు లేని ఈ చిట్కాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం
మూడు తలుపులు.. ఒకటే సురక్షితం! మీరైతే ఏ డోర్ తెరుస్తారు?
మూడు తలుపులు.. ఒకటే సురక్షితం! మీరైతే ఏ డోర్ తెరుస్తారు?
చిట్టీ వేస్తున్నారా..? లాభపడాలంటే ఇలా చేయండి..
చిట్టీ వేస్తున్నారా..? లాభపడాలంటే ఇలా చేయండి..
వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనపై CM దిగ్భ్రాంతి.. 9కి చేరిన మరణాలు
వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనపై CM దిగ్భ్రాంతి.. 9కి చేరిన మరణాలు
ప్రేమలో మీ ఆకర్షణను పెంచే చాణక్యుడి అద్భుత సూత్రాలు ఇవే!
ప్రేమలో మీ ఆకర్షణను పెంచే చాణక్యుడి అద్భుత సూత్రాలు ఇవే!