AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొసళ్లు, సింహం, పాము.. ఆ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? మీ తెలివికి సవాల్ విసిరే చిక్కుప్రశ్న

Viral Telugu Puzzles: చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి, కింద మొసళ్లు, ఒడ్డున సింహం, కొమ్మపై పాము.. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా చిక్కుకుపోతే ఎలా బయటపడతారు? ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆసక్తికరమైన చిక్కుప్రశ్న. చాలామంది క్లిష్టమైన సమాధానాలు వెతుకుతుంటే, అసలు సమాధానం మాత్రం తెలివిగా ఆలోచించడంలో దాగి ఉంది. ఈ పజిల్‌కు సంబంధించిన పూర్తి సమాధానం మీ పరిశీలనా శక్తిని చెప్పేస్తుంది..

మొసళ్లు, సింహం, పాము.. ఆ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? మీ తెలివికి సవాల్ విసిరే చిక్కుప్రశ్న
Famous Lion Crocodile Snake Puzzle
Srilakshmi C
|

Updated on: Jun 06, 2026 | 6:00 PM

Share

చిక్కుప్రశ్నలు, ఫజిల్స్‌ మన తెలివితేటలను పరీక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన చిక్కుప్రశ్న ఇక్కడ ఇచ్చాం. పై ఫొటోలో ఓ వ్యక్తి చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉండటం కనిపిస్తున్నాడు. అతని కింద నదిలో మొసళ్లు నోరు తెరిచి ఉన్నాయి. మరోవైపు ఒడ్డున సింహం కూర్చొని ఉంది. అతను వేలాడుతున్న చెట్టు కొమ్మకు పాము కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే చాలా మంది “అతను ఎలా ప్రాణాలు కాపాడుకుంటాడు?” అనే ప్రశ్న తలెత్తుతుంది. వీటన్నింటినీ తప్పించుకుని అతడు ప్రాణాలు కాపాడుకోవడమే అసలైన టాస్క్‌.

చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి ఎలా ప్రాణాలు కాపాడుకుంటాడు? అనేదే చిక్కు ప్రశ్న

ఇక్కడ మూడు మార్గాలు ఉన్నాయి.

  • మొదటిది అతను చెట్టుపైకి ఎక్కాలి.
  • రెండు నీళ్లలో దూకి మొసళ్లను తప్పించుకుని ఈదుకుంటూ వెళ్లాలి.
  • అలాగే ఒడ్డున ఉన్న సింహాన్ని మోసం చేసి చాకచక్యంగా పారిపోవాలి.

Also Read: పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్‌ విసిరే చిక్కు ప్రశ్న

అయితే ఈ చిక్కుప్రశ్నల ప్రత్యేకత ఏమిటంటే.. దీని సమాధానం సాధారణంగా మనం ఊహించినంత క్లిష్టంగా ఉండదు. ఈ ప్రశ్నలో కూడా అదే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న సింహం, మొసళ్లు, చెట్టు, నది, పాము అన్నీ ఆ వ్యక్తి ప్రమాదంకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ వ్యక్తి ఎలా ప్రాణాలతో బయటపడాలి అనే చిక్కుముడి మనల్ని అయోమయంలో పడేస్తుంది.

సరైన సమాధానం ఏమిటంటే..?

ఈ చిక్కుప్రశ్నలో అసలు రహస్యం చిత్రాన్ని జాగ్రత్తగా గమనించడంలో ఉంది. చెట్టుపైకి ఎక్కాలా, మొసళ్లను తప్పించుకోవాలా, సింహాన్ని మోసం చేయాలా అని అనేక విధాలుగా ఆలోచిస్తాం. అయితే సరైన సమాధానం చాలా సులభంగా ఉంటుంది. ప్రశ్నలో దాగి ఉన్న అంశాన్ని గుర్తిస్తే చాలు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేయాలంటే.. ముందుగా చేతితో చెట్టు కొమ్మపై ఉన్న పామును పట్టి ఒడ్డున ఉన్న సింహంపైకి విసిరేయాలి. దానితో సింహం భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత అతడు కొమ్మ ద్వారా చెట్టు పైకి ఎక్కి.. ఒడ్డున దిగి తన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ చిక్కుప్రశ్న ప్రత్యేకత ఏమంటే — సమస్య కంటే, మనం ఎలా ఆలోచిస్తున్నామన్నదే అసలు పరీక్ష.

ఈ చిక్కుప్రశ్న మనకు మరో ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. చాలా సందర్భాల్లో సమస్య పెద్దదిగా కనిపించినా, దాన్ని సరైన కోణంలో పరిశీలిస్తే సమాధానం చాలా సులభంగా ఉంటుంది. ఇలాంటి చిక్కుప్రశ్నలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. పరిశీలనా శక్తి, తార్కిక ఆలోచన, సమస్యను కొత్త కోణంలో చూడగల సామర్థ్యాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే ఈ ప్రశ్నకు సమాధానం తెలివితోపాటు నిశితంగా గమనించే శక్తి ఉన్నవారే త్వరగా చెప్పగలరన్నమాట.

Follow Us