బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్యాసింజర్.. అనుమానమొచ్చి బ్యాగేజీ చెక్ చేయగా..
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ డ్రగ్స్ అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి సుమారు రూ.3.57 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగేజీని తనిఖీ చేయడంతో పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ ఘటనలో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్ అక్రమ రవాణా యత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. బ్యాంకాక్ నుంచి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)కు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 10.2 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 3.57 కోట్లగా కస్టమ్స్ అధికారులు తెలిపారు.
బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో బెంగుళూరు విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణీకుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రయాణీకుడి బ్యాగేజీని క్షుణ్నంగా తనిఖీ చేశారు. బ్యాగేజీ లోపల దాచి ఉంచిన హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లను గుర్తించి సీజ్ చేశారు.
సాంకేతికంగా ఆధునిక పద్ధతుల్లో పెంచిన ఈ హైడ్రోపోనిక్ గంజాయికి డ్రగ్స్ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అత్యంత గోప్యంగా దీన్ని బ్యాంకాక్ నుంచి భారత్‌లోకి తరలిస్తూ ఆ స్మగ్లర్ దొరికిపోయాడు. నిందితుడు అక్షయ్ పవిత్రన్ (32)ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠాలపై కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Hydroponic Ganja Seized At Bengaluru Airport
భారీగా గంజాయి సీజ్..
🚨 Major NDPS Seizure at Bengaluru Airport | 05.06.2026 Bengaluru Customs intercepted a passenger arriving from Bangkok and seized 10.20 kg of hydroponic ganja, valued at ₹3.57 crore, concealed in checked-in baggage. The accused was arrested under the NDPS Act.#CBIC #Customs
— Bengaluru Customs (@blrcustoms) June 8, 2026
మరో రెండు ఘటనల్లో ఇద్దరు అరెస్ట్
ఇదిలా ఉండగా మరో ఘటనలో ఈ నెల 4న బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో ప్రయాణీకుడి దగ్గరి నుంచి బెంగళూరు కస్టమ్స్ అధికారులు 6.66 కేజీల హైడ్రోపోనిగ్ గంజాయిను సీజ్ చేశారు. దీని విలువ దాదాపు 2.33 కోట్లు. నిందితుడిని అరెస్టు చేశారు. ఆదివారం (జూన్ 7న) కూడా మరో ప్రయాణీకుడి దగ్గరి నుంచి రూ.1.75 కోట్లు విలువ చేసే 5.0 కేజీల హైడ్రోపోనిగ్ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ అక్రమ రవాణా ఘటనల దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు మరింత కఠినతరం చేస్తున్నామని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు.
