AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuni: 2 రోజులైనా వీడని తుని చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామంలో రెండేళ్ల చిన్నారి అదృశ్య కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tuni: 2 రోజులైనా వీడని తుని చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ
Jahnavi Missing
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2026 | 7:07 PM

Share

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన మూడేళ్ల బాలిక జాహ్నవి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు రోజులైనా ఆచూకీ దొరక్కపోవడంతో డ్రోన్లతో సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తుని మండలం దొండవాక సమీపంలోని పామాయిల్‌ తోటలో కాపలా ఉండే దంపతులకు చెందిన చిన్నారి మిస్సవగా పామాయిల్‌ తోటలతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. పాపతోపాటు పెంపుడు కుక్క కూడా కనపించకుండా పోవడం షాకిస్తోంది. అయితే.. బాలికను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా?.. పొరపాటున అడవిలోకి వెళ్లిందా..? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రెండు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక.. చిన్న పాపకు స్నానం చేయించి వచ్చే లోపే జాహ్నవి కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లి చెప్తోంది. అదేసమయంలో ఘటనాస్థలానికి అరకిలోమీటర్‌ దూరంలో పాప వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు ఉండడంతో టెన్షన్‌ పుడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్నారి మిస్సయిన ప్రదేశాన్ని స్థానిక MRO GVS ప్రసాద్‌ పరిశీలించారు. మూడేళ్ల చిన్నారి ఇంతదూరం వెళ్లే ఛాన్స్‌ లేదని.. చిన్నారి మిస్సింగ్‌పై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులను, చుట్టుపక్కలవారిని పోలీసులు ప్రశ్నించినట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి MRO GVS ప్రసాద్‌ ఇంకేమంటున్నారో మా చీఫ్‌ రిపోర్టర్‌ సత్య వివరిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెండు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన
రెండు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన
ఏ ఖర్చు లేని ఈ చిట్కాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం
ఏ ఖర్చు లేని ఈ చిట్కాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం
మూడు తలుపులు.. ఒకటే సురక్షితం! మీరైతే ఏ డోర్ తెరుస్తారు?
మూడు తలుపులు.. ఒకటే సురక్షితం! మీరైతే ఏ డోర్ తెరుస్తారు?
చిట్టీ వేస్తున్నారా..? లాభపడాలంటే ఇలా చేయండి..
చిట్టీ వేస్తున్నారా..? లాభపడాలంటే ఇలా చేయండి..
వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనపై CM దిగ్భ్రాంతి.. 9కి చేరిన మరణాలు
వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనపై CM దిగ్భ్రాంతి.. 9కి చేరిన మరణాలు
ప్రేమలో మీ ఆకర్షణను పెంచే చాణక్యుడి అద్భుత సూత్రాలు ఇవే!
ప్రేమలో మీ ఆకర్షణను పెంచే చాణక్యుడి అద్భుత సూత్రాలు ఇవే!
వంటింటి మొండి మరకలను వదిలించే అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇవే!
వంటింటి మొండి మరకలను వదిలించే అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇవే!
చేతిలో అదనపు వేలు ఉంటే అదృష్టం కలిసొస్తుందా? ఆశ్చర్యపరిచే..
చేతిలో అదనపు వేలు ఉంటే అదృష్టం కలిసొస్తుందా? ఆశ్చర్యపరిచే..
జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఇవే!
జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఇవే!
రమ్యకృష్ణను కృష్ణవంశి ప్రేమలో పడేలా చేసిన సూపర్ హిట్ సాంగ్
రమ్యకృష్ణను కృష్ణవంశి ప్రేమలో పడేలా చేసిన సూపర్ హిట్ సాంగ్