AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Holidays 2026: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జూన్ 17 వరకు APలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..?

AP Summer Holidays 2026 Extention: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించే అవకాశంపై చర్చ జరుగుతోంది. జూన్ 12న బడులు పునఃప్రారంభం కాకుండా జూన్ 15 లేదా 17కు వాయిదా వేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..

Summer Holidays 2026: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జూన్ 17 వరకు APలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..?
AP-School-Summer-Holidays Extention update
Srilakshmi C
|

Updated on: Jun 08, 2026 | 6:39 PM

Share

అమరావతి, జూన్‌ 8: వేసవి సెలవులు ముగింపుకు చేరుకున్నాయి. అయినా పలు రాష్ట్రాల్లో వేడి తీవ్రత నిప్పుల కొలిమిలా ఉంది. ఇప్పటికే తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రకటనలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉంది. సెలవును మరికొన్ని రోజులు పొడిగించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉధృతంగా ఉందని గుర్తు చేస్తూ బీజేపీ శాసనసభ్యులు విష్ణు కుమార్‌రాజు కూటమి ప్రభుత్వానికి విన్నవించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎండల తీవ్రత దృష్ట్యా జూన్‌ 12న బడుల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వేసవి సెలవుల పొడిగింపుపై ఆయన విద్యశాఖకు లేఖ రాశారు.

తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు తెరచుకోవాలి. ఆ తర్వాత వచ్చే జూన్‌ 13, 14 తేదీలు రెండో శనివారం, ఆదివారాలు సెలవులు ఉన్నాయి. దీంతో జూన్‌ 15 లేదంటే జూన్‌ 17న బడులు రీ ఓపెనింగ్‌ చేయాలని బీజేపీ శాసనసభ్యులు విష్ణు కుమార్‌రాజు తన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విద్యాశాఖ అధికారులకు లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు రాష్ట్రంలో స్కూళ్లు తెరచుకోవడానికి ముందే తాగునీళ్లు, మరుగుదొడ్లు, తరగతుల్లో ఫ్యాన్లు, లైట్లు వంటి సదుపాయాలు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగానే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ రోజు (సోమవారం) 15 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా గూడూరులో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా – గోపాలపురం (చిట్యాల)లో 41.4°C, అనకాపల్లి జిల్లా – ఎస్.రాయవరం – 41.2°C, కృష్ణా జిల్లా – పెదపరుపూడి – 41.0°C, మార్కాపురం జిల్లా – కనిగిరి (నందన మారెల) – 40.9°C, పశ్చిమగోదావరి జిల్లా – తణుకు – 40.9°C, పార్వతీపురం మన్యం జిల్లా – పెదమేరంగి – 40.5°C, విజయనగరం జిల్లా – వేపాడ – 40.5°C, తిరుపతి జిల్లా – సూళ్లూరుపేట – 40.4°C, విశాఖపట్నం జిల్లా – గాజువాక – 40.4°C, కోనసీమ జిల్లా – కె.గంగవరం (శివాల) – 40.3°C, కాకినాడ జిల్లా – కాజులూరు – 40.3°C, ఏలూరు జిల్లా – కుకునూరు – 40.2°C, పోలవరం జిల్లా – కునవరం – 40.2°C, శ్రీకాకుళం జిల్లా – మందస – 40.2°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్ర వేడి పరిస్థితుల్లో పిల్లలు త్వరగా డీహైడ్రేషన్, వడదెబ్బ, జ్వరం వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని, అందుకే సెలవులను పొడిగించాలని తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow Us