Gas Stove Cleaning: గ్యాస్ స్టవ్‌పై జిడ్డు, మొండి మరకలు పేరుకుపోయాయా? ఈ 6 చిట్కాలతో నిమిషాల్లో మెరిపించండి!
వంటగదిలో ప్రతిరోజూ గ్యాస్ స్టవ్‌పై వంట చేయడం వల్ల నూనె చుక్కలు, పాలు పొంగిపోవడం, ఆవిరి, పొగ ఆహార కణాలు చేరి స్టవ్ ఎంతో మురికిగా, జిగటగా మారుతుంది. దీనిని వెంటనే శుభ్రం చేయకపోతే ఆ జిడ్డు ఒక మొండి పొరలా పేరుకుపోయి సాధారణ నీటితో అస్సలు వదలదు. రసాయన క్లీనర్ల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే లభించే బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం ఉప్పు వంటి 6 సులభమైన సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి గ్యాస్ స్టవ్‌ను, బర్నర్లను నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించవచ్చు.

వంటగదిలో నిత్యం ఉదయం, సాయంత్రం గ్యాస్ స్టవ్‌పై వంట చేయడం సాధారణమే. అయితే మనం వంట చేసిన ప్రతిసారీ స్టవ్ మురికిగా మారుతుంటుంది. కొన్నిసార్లు పాలు పొంగిపోవడం, కూరలు వండేటప్పుడు నూనె చుక్కలు ఎగిరి పడటం లేదా మసాలాలు ఒలికిపోవడం వంటివి జరుగుతుంటాయి. ప్రతిరోజూ స్టవ్ చుట్టూ చేరే ఆవిరి, పొగ, నూనె జిడ్డు ఆహార కణాల వల్ల గ్యాస్ స్టవ్ క్రమంగా తన మెరుపును కోల్పోతుంది. మీ ఇంటి గ్యాస్ స్టవ్ కూడా ఇలాగే విపరీతమైన జిడ్డుతో మారి, శుభ్రపరచడం కష్టంగా అనిపిస్తే, రసాయన క్లీనర్ల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండే వస్తువులతో సులభంగా ఎలా మెరిపించవచ్చో తెలుసుకుందాం.
1. బేకింగ్ సోడా – నిమ్మరసం రోజూ వంట చేయడం వల్ల మీ స్టవ్‌టాప్ జిగటగా మారినట్లయితే, దానిని కేవలం సాదా నీటితో శుభ్రం చేయడం వెంటనే ఆపండి. దీనికోసం అద్భుతమైన క్లీనర్‌గా పనిచేసే బేకింగ్ సోడా నిమ్మరసాన్ని ఉపయోగించండి. మొదటగా ఒక టీస్పూన్ బేకింగ్ సోడా పొడిని గ్యాస్ స్టవ్‌టాప్ అంతటా సమానంగా చల్లాలి. ఆ తర్వాత దానిపై తాజా నిమ్మరసాన్ని పిండాలి. బేకింగ్ సోడా, నిమ్మరసం కలిసినప్పుడు వచ్చే రసాయన చర్య వల్ల జిడ్డు వదులవుతుంది. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు అలాగే వదిలేసి, ఆపై ఒక స్పాంజ్ లేదా మృదువైన స్క్రబ్బర్‌తో సున్నితంగా రుద్దాలి. దీనివల్ల స్టవ్‌టాప్‌పై ఉన్న ఎంతటి మొండి జిగట మరకలైనా నిమిషాల్లో మాయమైపోతాయి.
2. వెనిగర్ స్ప్రే వంటగదిలోని జిడ్డు వస్తువులను ప్లాట్‌ఫారమ్‌ను శుభ్రపరచడానికి వెనిగర్ (తెల్ల వెనిగర్) చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ఖాళీ స్ప్రే బాటిల్‌ను తీసుకొని అందులో వెనిగర్ కొద్దిగా నీటిని కలిపి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్యాస్ స్టవ్ అంతటా బాగా స్ప్రే చేయాలి. ఒకవేళ జిడ్డు ఎక్కువగా ఉంటే స్ప్రే చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు దానిని అలాగే వదిలేయాలి. వెనిగర్‌లో ఉండే ఎసిడిక్ గుణాల వల్ల జిడ్డు మురికి చాలా సులభంగా వదులైపోతాయి. ఆ తర్వాత ఒక శుభ్రమైన, తడి కాటన్ గుడ్డతో స్టవ్‌ను తుడిస్తే సరిపోతుంది.
3. గిన్నెలు కడిగే సబ్బు – గోరువెచ్చని నీరు మీ వంటగదిలో ఉండే సాధారణ లిక్విడ్ డిష్ వాష్ లేదా గిన్నెలు కడిగే సబ్బు కూడా గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కు అద్భుతంగా సహాయపడుతుంది. కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కొద్దిగా డిష్ వాష్ సబ్బును కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్పాంజ్ లేదా మెత్తటి గుడ్డకు పూసి, స్టవ్ ఉపరితలంపై బాగా రుద్దాలి. గోరువెచ్చని నీరు, నూనె జిడ్డును వేగంగా కరిగిస్తుంది. దీనివల్ల నిమిషాల్లోనే జిడ్డు అంతా తొలగిపోయి మీ స్టవ్ పూర్తిగా శుభ్రంగా, తళతళలాడుతూ మారుతుంది. దీనితో పాటు వెనిగర్ లేదా డిష్ వాష్ వాడటం వల్ల స్టవ్ పై ఉండే క్రిములు, బ్యాక్టీరియా కూడా పూర్తిగా నశిస్తాయి.
4. బేకింగ్ సోడా పేస్ట్ చిట్కా కేవలం బేకింగ్ సోడాతో ఒక చిక్కటి పేస్ట్‌ను తయారు చేసి కూడా మొండి మరకలను వదిలించవచ్చు. ఒక చిన్న గిన్నెలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కటి పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా కలపాలి. ఈ తయారు చేసుకున్న పేస్ట్‌ను గ్యాస్ స్టవ్‌పై జిగురు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నల్లటి మరకలు ఉన్న చోట బాగా పట్టించాలి. 15 నిమిషాల పాటు ఆ పేస్ట్‌ను అలాగే ఉంచి, ఆ తర్వాత ఒక పాత మృదువైన టూత్ బ్రష్‌తో సున్నితంగా రుద్ది తుడిచేయాలి.
5. నిమ్మకాయ, ఉప్పు మిశ్రమం వంటింట్లో సహజసిద్ధమైన స్క్రబ్బర్‌గా నిమ్మకాయ-ఉప్పు కాంబినేషన్‌ను పేర్కొనవచ్చు. నిమ్మకాయను తీసుకొని దానిని సమానంగా సగానికి కోయాలి. ఆ కోసిన నిమ్మబద్దపై కొద్దిగా వంట ఉప్పును చల్లి, దానిని నేరుగా గ్యాస్ స్టవ్‌పై పెట్టి బాగా రుద్దాలి. ఈ నిమ్మ-ఉప్పు మిశ్రమం అత్యంత శక్తివంతమైన సహజ క్లీనర్‌గా పనిచేస్తుంది. దీనిని కేవలం గ్యాస్ స్టవ్ కోసమే కాకుండా, రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్), ఓవెన్ వంటగది చిమ్నీల నుండి మొండి జిడ్డు మరకలను సులభంగా తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు.
6. గ్యాస్ బర్నర్ల క్లీనింగ్ విధానం వంట చేసేటప్పుడు గ్యాస్ బర్నర్‌లపై తరచుగా పాలు, పప్పులు లేదా అన్నం గంజి ఒలికిపోతుంటాయి. దీనివల్ల బర్నర్ల రంధ్రాలు మూసుకుపోయి గ్యాస్ మంట సరిగ్గా రాదు. వీటిని శుభ్రం చేయడానికి ఒక పాత్రలో వేడినీళ్లు తీసుకొని, అందులో కొద్దిగా వెనిగర్ కలిపి, ఆ మిశ్రమంలో బర్నర్లను కొంతసమయం పాటు నానబెట్టాలి. వేడినీటి వల్ల రంధ్రాలలో ఇరుక్కుపోయిన ఆహార కణాలు వదులవుతాయి. ఆ తర్వాత ఒక పాత బ్రష్‌తో బర్నర్లను బాగా రుద్ది శుభ్రం చేయాలి. ఆపై వాటిని మంచి నీటితో కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే తిరిగి స్టవ్‌కు అమర్చాలి.
