AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premature Greying: 25 ఏళ్లకే జుట్టు తెల్లబడుతోందా? ఈ 5 తీసుకుంటే వృద్ధాప్యం వరకు జుట్టు నల్లగా ఉంటుంది!

మారుతున్న జీవనశైలి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాల వల్ల 20 నుండి 25 ఏళ్ల వయసున్న యువతలోనే కాకుండా పాఠశాల వయస్సు పిల్లల్లో కూడా తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. రసాయనాలు అధికంగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ వాడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. అయితే మన దైనందిన ఆహారంలో ఉసిరి, నల్ల నువ్వులు, నల్ల ఎండుద్రాక్ష, కరివేపాకు, సువర్ణ సిద్ధ ఘృతం వంటి 5 సహజసిద్ధమైన ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా చిన్న వయసులోనే జుట్టు నెరవకుండా నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Premature Greying: 25 ఏళ్లకే జుట్టు తెల్లబడుతోందా? ఈ 5 తీసుకుంటే వృద్ధాప్యం వరకు జుట్టు నల్లగా ఉంటుంది!
Premature Hair Greying Remedies,
Bhavani
|

Updated on: Jun 08, 2026 | 6:43 PM

Share

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సౌందర్య సమస్య తెల్ల జుట్టు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే వృద్ధాప్య లక్షణమైన ఈ నరవడం, ప్రస్తుతం 20 నుండి 25 ఏళ్ల వయసున్న యువతలోనే కాకుండా చిన్న పిల్లల్లో కూడా సర్వసాధారణంగా కనిపిస్తోంది. శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల జుట్టు త్వరగా నెరసిపోవచ్చు. దీనితో పాటు నాణ్యత లేని షాంపూలు వాడటం, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు సంరక్షణ ఉత్పత్తులను (కెమికల్ ప్రొడక్ట్స్) ఎక్కువగా ఉపయోగించడం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చిన్న వయసులోనే మీ జుట్టు తెల్లబడకుండా చూసుకోవాలంటే, కొన్ని సహజసిద్ధమైన ఆహార పదార్థాలను ఈ రోజు నుంచే మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల మీ జుట్టు మెరిసి, బలపడటమే కాకుండా, చాలా కాలం పాటు నల్లగా, ఒత్తుగా ఉంటుంది. ఆ 5 అద్భుతమైన ఆహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. ఆమ్లా (ఉసిరి) – జుట్టుకు అమృతం ఉసిరి కాయలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు చిన్న వయసులోనే నెరసిపోవడాన్ని సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు, కుదుళ్లకు లోపలి నుండి మంచి పోషణను అందిస్తాయి.

తాజా ఉసిరి పండు రూపంలో లేదా ఉసిరి మురబ్బాలా తీసుకోవచ్చు.

3 గ్రాముల ఉసిరి పొడిని అర టీస్పూన్ నెయ్యితో కలిపి క్రమం తప్పకుండా తీసుకోవాలి.

5 నుండి 10 మిల్లీలీటర్ల తాజా ఉసిరి రసాన్ని కొద్దిగా గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి.

పిల్లల కోసం మార్కెట్లో దొరికే లేదా ఇంట్లో చేసిన ఉసిరి మిఠాయిలను ఇవ్వవచ్చు.

అంతేకాకుండా ఉసిరిని నూనెలో వేసి బాగా మరిగించి, ఆ నూనెను తలకు పట్టించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

2. నల్ల నువ్వులు – మెలనిన్ ఉత్పత్తి కోసం.. నల్ల నువ్వులు శరీరంలో మెలనోసైట్ల అనగా జుట్టుకు నలుపు రంగును ఇచ్చేందుకు ఎంతగానో దోహద పడతాయి. ఇది జుట్టు సహజమైన నలుపు రంగును దీర్ఘకాలం పాటు కాపాడుకోవడానికి సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత నోటి దుర్వాసన రాకుండా ప్రతిరోజూ సుమారు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను నమిలి తినవచ్చు. గోధుమ పిండితో కలిపి చేసిన నువ్వుల లడ్డూలు లేదా నువ్వుల చిక్కీల రూపంలో కూడా వీటిని తీసుకోవచ్చు. నల్ల నువ్వుల నూనెలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఈ నూనెతో తలపై మసాజ్ చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టుకు అద్భుతమైన పోషణ అందుతుంది.

3. నల్ల ఎండుద్రాక్షలు… నల్ల ఎండుద్రాక్షలో సహజ సిద్ధంగా ఇనుము, విటమిన్ సి పోషకాలు నిండి ఉంటాయి. ఇవి జుట్టు నలుపు రంగును కాపాడుకోవడానికి కొత్త జుట్టు వేగంగా పెరగడాన్ని ప్రోత్సహించడానికి చాలా బాగా సహాయపడతాయి. 5 నుండి 6 నల్ల ఎండుద్రాక్షలను రాత్రంతా ఒక కప్పు నీటిలో బాగా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నానబెట్టిన ద్రాక్షలను తిని, ఆ నీటిని కూడా తాగడం వల్ల శరీరంలో రక్తం పెరిగి జుట్టు రాలడం తగ్గుతుంది.

4. కరివేపాకు – జుట్టు సంరక్షణకు బెస్ట్ ఆప్షన్ మన వంటింట్లో ప్రతిరోజూ వాడే కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, బి12 పోషకాలతో పాటు ఇనుము కాల్షియం విరివిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని అద్భుతంగా తగ్గించడమే కాకుండా, చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడాన్ని పూర్తిగా నెమ్మదింపజేస్తాయి. ప్రతిరోజూ మనం వండుకునే కూరగాయలు, సాంబార్ ఇతర వంటకాలలో కరివేపాకును వేసి, దానిని పక్కన పారేయకుండా నమిలి తినాలి. 5 నుండి 10 కరివేపాకులను నీటిలో వేసి బాగా ఉడకబెట్టి, ఆ డికాషన్ లేదా వాటర్ ను ఉదయాన్నే తాగవచ్చు. పిల్లల కోసం ఉసిరి కరివేపాకులను కలిపి ఇంట్లోనే రుచికరమైన చట్నీని తయారు చేసి అన్నం లేదా ఇడ్లీలతో తినిపించవచ్చు.

5. సువర్ణ సిద్ధ ఘృత – ఆయుర్వేద రహస్యం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, A2 రకం ఆవు నెయ్యిలో 24 క్యారెట్ల బంగారు సూక్ష్మ మూలకాలను (గోల్డ్ పార్టికల్స్) చేర్చి ప్రత్యేక పద్ధతిలో తయారు చేసిన ఒక విశిష్టమైన ఆయుర్వేద నెయ్యిగా ఇది పరిగణిస్తారు. దీనివల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం వివరిస్తోంది. ఇది జుట్టు సహజమైన నలుపు రంగును కాపాడుకోవడానికి జుట్టుకు లోతైన మెరుపును ఇవ్వడానికి సహాయపడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల్లో యువతలో జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి, రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. శరీర కణాలకు లోతైన పోషణను ఇవ్వడానికి ఇది ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం ఇంటర్నెట్ లోని ఆరోగ్య నివేదికలు ఆయుర్వేద నిపుణుల సలహాల ఆధారంగా మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. తీవ్రమైన జుట్టు రాలడం లేదా చర్మ అలర్జీల వంటి సమస్యలు ఉన్నప్పుడు, లేదా ఏదైనా కొత్త ఆయుర్వేద సప్లిమెంట్లను తీసుకునే ముందు ఖచ్చితంగా వైద్యులను లేదా చర్మ నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.

Follow Us