AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ టెస్ట్ సిటీ స్లిప్ విడుదల.. జూన్‌ 21 వరకు వారంతా లాక్‌డౌన్‌లోనే!

ఎంబీబీఎస్‌, బీడీఎస్ వంటి వైద్య కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మే 12న నీట్-యూజీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్‌ పరీక్షను మే 12న ఎన్‌టీఏ రద్దు చేసింది. సీబీఐ ఈ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెలలో జరగనున్నా రీటెస్ట్ కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..

NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ టెస్ట్ సిటీ స్లిప్ విడుదల.. జూన్‌ 21 వరకు వారంతా లాక్‌డౌన్‌లోనే!
NEET UG Re-Test City Intimation Slip
Srilakshmi C
|

Updated on: Jun 08, 2026 | 3:29 PM

Share

హైదరాబాద్‌, జూన్ 8: నీట్ యూజీ 2026 రీ టెస్ట్‌కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి నీట్-యూజీ 2026 కోసం తమకు కేటాయించిన పరీక్షా నగరాన్ని తనిఖీ చేసుకోవచ్చు. ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో జూన్‌ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం ఉన్న నగరం సమాచార స్లిప్‌ను ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అడ్మిట్‌ కార్డులను పరీక్షకు 10 రోజుల ముందు జారీ చేస్తామని NTA సూచించింది.

నీట్ యూజీ 2026 రీటెస్ట్ ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

వారికి లాక్‌ డౌన్‌..?

ఎంబీబీఎస్‌, బీడీఎస్ వంటి వైద్య కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మే 12న నీట్-యూజీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్‌ పరీక్షను మే 12న ఎన్‌టీఏ రద్దు చేసింది. సీబీఐ ఈ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఇక తిరిగి జూన్ 21న నీట్ యూజీ పునఃపరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఈసారి పేపర్ లీక్‌కు తావులేకుండా ఎన్టీయే పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ప్రశ్నాపత్రం రూపొందించిన నిపుణులను రహస్య ప్రదేశంలో లాక్‌డౌన్‌లో ఉంచింది. నీట్ రీ టెస్ట్ ప్రశ్నపత్రం తయారీలో పాల్గొన్న నిపుణులందరి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ సదుపాయం, బయటి కమ్యూనికేషన్‌కు తావులేకుండా వారిని నిర్భందించారు.

ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కారణంగా నీట్ పరీక్ష రద్దు కావడంతో దాదాపు 23 లక్షల అభ్యర్థులు ప్రభావితమయ్యారు. పలువురు విద్యార్ధులు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష ఎలాంటి వివాదం లేకుండా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రశ్నపత్రం తయారీలో పాల్గొన్న పేపర్ సెట్టర్లు, మోడరేటర్లు, అనువాదకులు, ఇతర సిబ్బంది అందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి వారిపై 24 గంటల నిఘా ఉంచారు. వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం రద్దు చేశారు. బయటి వారితో సంభాషణలను నియంత్రించారు. ఈ నిర్భంధం జూన్ 21న జరిగే పునఃపరీక్ష పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందని కేంద్రం పేర్కొంది.

Follow Us