AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. రైల్వేలో 6,565 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ విడుదల

RRB Technician Recruitment 2026 Notification: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి సంబంధించి ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిపికేషన్‌ కింద మొత్తం 6,565 రైల్వే టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. రైల్వేలో 6,565 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ విడుదల
RRB Technician Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 08, 2026 | 3:57 PM

Share

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు).. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిపికేషన్‌ కింద మొత్తం 6,565 రైల్వే టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులు అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో విధులు నిర్వహించవల్సి ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పోస్టుల వివరాలు..

  • టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుల సంఖ్య: 323
  • టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుల సంఖ్య: 6,242

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు జులై 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు రూ.19,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు. విద్యార్హతలు, రాత పరీక్ష సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, దరఖాస్తు ప్రక్రియ, రీజియన్ల వారీ ఖాళీలు, రాత పరీక్ష వంటి ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు జూన్‌ 30వ తేదీన విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us