Dried Tulsi Plant: ఎండిన తులసి మొక్కలను పడేస్తున్నారా.. ఇలా వాడండి..

తులసి మొక్క ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క. ఇది సంప్రదాయమైన మొక్క. తులసిలో ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. ఆయుర్వేద పరంగా కూడా తులసిని ఉపయోగిస్తూ ఉంటారు. తులసి మొక్క నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటాయి. తులసిని ఎలా తీసుకున్నా కూడా శరీరానికి పోషకాలు అందుతాయి. ఒక్కోసారి ఇంట్లో ఒక్కోవైపు తులిసి మొక్క అనేది ఎండిపోతూ ఉంటుంది. దీంతో చాలా మంది వీటిని తీసి పారేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఎండిపోయిన తులసి..

Dried Tulsi Plant: ఎండిన తులసి మొక్కలను పడేస్తున్నారా.. ఇలా వాడండి..
Dried Tulasi Plant
Follow us

|

Updated on: Oct 17, 2024 | 5:38 PM

తులసి మొక్క ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క. ఇది సంప్రదాయమైన మొక్క. తులసిలో ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. ఆయుర్వేద పరంగా కూడా తులసిని ఉపయోగిస్తూ ఉంటారు. తులసి మొక్క నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటాయి. తులసిని ఎలా తీసుకున్నా కూడా శరీరానికి పోషకాలు అందుతాయి. ఒక్కోసారి ఇంట్లో ఒక్కోవైపు తులిసి మొక్క అనేది ఎండిపోతూ ఉంటుంది. దీంతో చాలా మంది వీటిని తీసి పారేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఎండిపోయిన తులసి మొక్కను కూడా ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు యూజ్ చేయవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.

తులసి ఆకులు:

ఎండిపోయిన తులసి ఆకుల్ని పడేయకుండా వాటిని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. ఎండిన తులసి ఆకుల్ని శుభ్రంగా కడిగి.. ఎండలో ఎండే దాకా మళ్లీ ఆరబెట్టండి. లేదంటే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టవచ్చు. ఆరిన తర్వాత వీటిని మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి. ఈ పొడితో హెర్బల్ టీలు తయారు చేసుకోవచ్చు. మరుగుతున్న నీటిలో ఈ పొడి వేసి మరిగించి.. ఆ నీటిని తాగవచ్చు. తేనె కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి.

ఎరువుగా:

మొక్క ఎండిపోతే పారేయకుండా దాన్ని ఇతర వాటికి ఎరువుగా ఉపయోగించవచ్చు. తులసి ఆకుల్ని వేరు చేసి చేతులతో బాగా నలపాలి. ఇప్పుడు ఈ పొడిని మీ ఇంట్లో పెంచుకునే మొక్కల మొదట్లో వేయండి. ఇలా వేయడం వల్ల భూమికి సారం అనేది పెరుగుతుంది. మొక్కలు బాగా గ్రోత్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

కొత్త మొక్క:

ఎండి తులసి మొక్కల్లో ఉండే విత్తనాలను సేకరించి కొత్త మొక్క తయారు చేసుకోవచ్చు. ఎండిన మొక్క నుంచి తులసి విత్తనాలను వేరు చేసి.. అదే కుండీలో పక్కకు చల్లండి. నీరు పోస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కొత్త తులసి మొక్కలు వస్తాయి. అదే విధంగా తులసి మొక్క కాండాలను పారేయకుండా ఎండలో చక్కగా ఆరబెట్టండి. అవి బాగా ఎండిన తర్వాత వాటిని ఓ కవర్‌లో పెట్టి.. హోమాలు, పూజలకు ఉపయోగించవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..