AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking water: నీరుని ఇలా తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు.. ఎప్పుడు? ఏ సమయంలో నీరు తాగాలంటే..

పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీరు తాగడం మేలు అని పెద్దలు చెబుతారు. అయితే నేటి సమాజంలో ఇలా నిలబడి నీరు తాగడం విషయంలో భినాభిప్రాయాలున్నాయి. మోకాళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయని మన సమాజంలో ఒక అపోహ ఉంది. అయితే నిలబడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదా..! కాదా..! నిపుణులు చెప్పిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం..

Drinking water: నీరుని ఇలా తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు.. ఎప్పుడు? ఏ సమయంలో నీరు తాగాలంటే..
Water Drinking
Surya Kala
|

Updated on: Sep 07, 2025 | 3:27 PM

Share

మన పెద్దలు నిలబడి నీరు త్రాగకూడదని చెప్పారు. ఎందుకంటే ఇలా నీరు తాగడం వలన మోకాళ్ల నొప్పి వస్తుందని చెబుతారు. ఈ విషయంపై మన సమాజంలో ఒక నమ్మకం ఉంది. అయితే ఇదే విషయంపై ఆరోగ్య నిపుణులు స్పందిస్తూ.. నిలబడి నీరు త్రాగడం వల్ల మన ఆరోగ్యంపై నిజంగా చెడు ప్రభావం చూపుతుందా? లేదో చెప్పారు. ఈ నమ్మకం వెనుక ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని చెప్పారు. నిలబడి లేదా కూర్చుని నీరు తాగితే మీ మోకాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపదని పోషకాహార నిపుణులు చెప్పారు. పరిగెడుతూ కూడా నీరు త్రాగే అథ్లెట్లకు ఎలాంటి సమస్యలు లేవని చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం మన శరీరంలో నీటిని పీల్చుకోవడం అనేది మోకాళ్లకు కాదు.. జీర్ణవ్యవస్థకు నేరుగా అనుసంధానించబడిన శాస్త్రీయ ప్రక్రియ. మనం నీరు త్రాగినప్పుడు ఈ నీరు నేరుగా జీర్ణవ్యవస్థలోకి వెళుతుంది. ఆ నీటిని శరీరం గ్రహిస్తుంది. కీళ్లలో మృదులాస్థి అరిగిపోవడం, కాల్షియం లోపం లేదా ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తాయి, దీనికి నీరు త్రాగే విధానంతో సంబంధం లేదు.

అయితే కొంత మందని పడుకుని నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇలా పడుకున్నప్పుడు నీరు త్రాగడం హానికరం పోషకాహార నిపుణుడు చెప్పారు. ఎవరైనా పడుకుని నీరు తాగితే.. ఆ నీరు అన్నవాహిక నుంచి నేరుగా కడుపులోకి వెళుతుంది. ఇది ఆహార పైపులో అడ్డంకిని కలిగిస్తుంది. ఇది కొన్నిసార్లు శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల పడుకున్నప్పుడు ఎప్పుడూ నీరు త్రాగకూడదు.

ఇవి కూడా చదవండి

సరైన మొత్తంలో నీరు త్రాగడం ముఖ్యం.. నీరు త్రాగే విధానం కంటే నీటి పరిమాణం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి అయినా రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, మలబద్ధకం , అలసట వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

నిలబడి నీరు తాగే బదులు.. కూర్చుని నెమ్మదిగా, తగినంత పరిమాణంలో నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు తాగడం కంటే.. కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిది. అంతేకాదు కూర్చుని నీరు తాగడం వల్ల కిడ్నీలపై భారం తగ్గుతుంది, నీరు సమతుల్యంగా శరీరానికి చేరుతుంది. కనుక వీలైనంత వరకూ కూర్చుని నీరు తాగడం మంచిదని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి