Vastu Tips: ఇంట్లో ఈ దిశ కుబేర దిశ.. ఈ వస్తువులను పెట్టుకోండి.. సంపదకు లోటు ఉండదు
వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశ కుబేరుడితో ముడిపడి ఉంది. ఈ దిశలో వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. అలాగే సానుకూల శక్తి ప్రవాహం నిరంతరం ఉంటుంది. ఎందుకంటే కుబేరుడు సంపదకు అధిపతి. అటువంటి పరిస్థితిలో వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిశలో ఏ వస్తువులను పెట్టుకోవాలి? ఏ వస్తువులు పెట్టుకోకూడదో తెలుసుకుందాం..

ఎవరైనా సరే ఇంట్లో, ఆఫీసులో కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే సానుకూల ఫలితాలను పొందవచ్చు. దీనితో పాటు వాస్తు శాస్త్రంలో ప్రతి దిశ ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు మనం ఉత్తర దిశకు సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను గురించి తెలుసుకుందాం.. ఈ దిశ సంపద , శ్రేయస్సు దేవుడు అయిన కుబేరుడికి సంబంధించినది.
ఆర్థిక సంక్షోభం ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో డబ్బు లేదా ఖజానా పెట్టే ఉంచడం వల్ల ఆర్థిక లాభాలు వస్తాయని నమ్ముతారు. దీనితో పాటు మీరు ఈ దిశలో కుబేర దేవుడి చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీకు ఆర్థిక లాభాల అవకాశాలను సృష్టిస్తుంది. దీనితో పాటు ఈ దిశలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారస్తులు వ్యాపారంలో ప్రయోజనాలను పొందవచ్చు.
ఏ మొక్కలు పెట్టుకోవాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో మనీ ప్లాంట్, తులసి వంటి మొక్కలను ఉంచుకోవచ్చు. దీనివల్ల సంపద పెరుగుతుంది. దీనితో పాటు ఇంటికి ఉత్తర దిశలో వెదురు మొక్కను నాటడం ద్వారా కూడా మీరు ప్రయోజనాలను పొందవచ్చు.
వేటిని ఉంచుకోవడం వల్ల ప్రయోజనాలంటే కుబేర దేవుడి ఆశీర్వాదం పొందడానికి ఉత్తర దిశలో ఒక చిన్న ఫౌంటెన్, అక్వేరియం, లోహం లేదా స్ఫటిక తాబేలు మొదలైన వాటిని ఉంచవచ్చు. దీనితో పాటు వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నది, జలపాతం మొదలైన వాటి చిత్రాన్ని ఉంచడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని ఉంచుతుంది.
ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించడానికి ప్రధాన తలుపు ద్వారం దగ్గర నేమ్ ప్లేట్, విండ్ చైమ్స్ మొదలైన వాటిని కూడా ఉంచవచ్చు.
ఏ వస్తువులను ఉంచుకోకండి ఇంట్లో ఉత్తర దిశలో బూట్లు, చెప్పులు, చెత్తబుట్టలు లేదా ఏదైనా బరువైన వస్తువులను పొరపాటున కూడా ఉంచకూడదు. దీని వల్ల కుబేరుడు కోపంగా ఉండవచ్చు. దీనివల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఉత్తర దిశను మురికిగా ఉంచవద్దు. లేకుంటే అది సానుకూల శక్తిని అడ్డుకుంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)








