AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rekha: రేఖ తల్లి తన కూతురిని పాక్ క్రికెటర్ కి ఇచ్చి పెళ్లి చేయలనుకుందా..! 40 ఏళ్ల పోస్ట్ వైరల్

దక్షిణాది నుంచి బాలీవుడ్ లో అడుగు పెట్టి.. నల్ల పిల్ల పనికి రాదు అన్న నోటనే వావ్ ఏమి నటన అని ప్రశంసలను అందుకుంది. తల్లిదండ్రులిరువురూ గొప్ప నటులు.. ఆ నటననే వారసత్వంగా తీసుకుని వెండి తెరపై బాలనటిగా అడుగు పెట్టింది.. తర్వాత ఎన్నో కష్టాలు అవమానాలను ఎదుర్కొని హిందీ చిత్ర పరిశ్రమని ఏలి ఎవర్‌గ్రీన్ స్టార్ రేఖకి సంబందించిన ఒక వార్తా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రేఖ జీవితంలో ప్రేమ గురించి రకరకాల వార్తలు ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా రేఖ పెళ్ళికి సంబంధించిన 40 ఏళ్ల పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది.

Rekha: రేఖ తల్లి తన కూతురిని పాక్ క్రికెటర్ కి ఇచ్చి పెళ్లి చేయలనుకుందా..! 40 ఏళ్ల పోస్ట్ వైరల్
Rekha Mother Wanted Former Pakistani Cricketer
Surya Kala
|

Updated on: Sep 07, 2025 | 12:03 PM

Share

బాలీవుడ్ లో ఎవర్‌గ్రీన్ స్టార్ రేఖ.. 60 ఏళ్ళు దాటినా అందానికి కేరాఫ్ అడ్రస్ గా అభివర్ణిస్తారు. అసలు పేరు భానురేఖ గణేశన్. బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టి.. 200కి పైగా సినిమాల్లో యాక్ట్‌ చేసింది. బాలీవుడ్ లో ఓ ఐకాన్. జెమినీ గణేషన్ పుష్పవల్లి ల కూతురు రేఖ. నటనని వారసత్వంగా తీసుకున్న రేఖ చిన్నప్పటి నుంచి సినిమాల్లో చురుగ్గా నటించింది. తెలుగు సినిమాలైన ‘ఇంటి గుట్టు’, ‘రంగుల రత్నం’ లలో బాలనటిగా వెండి తెరపై అడుగుపెట్టింది. హిందీ సినిమాకి రాకముందు.. 1969లో కన్నడ సినిమా ‘ఆపరేషన్ జాక్‌పాట్’ తో హీరోయిన్ గా అడుగు పెట్టింది. రేఖ ‘సావన్ బాదో’ చిత్రంతో బాలీవుడ్ లో తొలి అడుగు వేసింది, అందులో ఆమె చంద పాత్రను పోషించింది.

రేఖ అందం, అభినయానికి ఉత్తరాదివారు ఫిదా. రేఖ కెరీర్ పీక్ స్టేజ్ కి వెళ్ళే కొద్దీ.. ఆమె సినిమాల గురించి, అలాగే ఆమె వ్యక్తిగత జీవితం గురించి రకరకాల వార్తలు వినిపించడం మొదలయ్యాయి. వినోద్ మెహ్రా నుంచి అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్ వరకు చాలా మంది హీరోలతో రేఖ పేరు ముడిపడి ఉంది. అయితే.. రేఖ తల్లి పుష్పవల్లి ముఖేష్ లేదా అమితాబ్ బచ్చన్ కాదు.. ఒక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన అల్లుడు కావాలని కోరుకున్నారని మీకు తెలుసా.. 40 ఏళ్ల క్రితం ఒక వార్త క్లిప్ ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రేఖ, ఇమ్రాన్ ఖాన్ తో సరిపోలిందా?

1980లో రేఖ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. అదే సమయంలో రేఖ ప్రేమ గురించి ఓ సంచలన వార్త. 1985లో స్టార్ రిపోర్ట్.. రేఖకు, మాజీ పాకిస్తాన్ క్రికెటర్ , రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ ఒక వార్తను ప్రచురించింది. రేఖ తల్లి పుష్పవల్లి తన కుమార్తెకు ఇమ్రాన్ ఖాన్ కంటే మంచి జంట మరొకరు లేరని భావించిందని కూడా ఆ పత్రిక తన ప్రకటనలో పేర్కొంది. రేఖ తల్లి ఢిల్లీకి వచ్చి ఒక జ్యోతిష్కుడుని కలిసినట్లు తెలిసింది.

రేఖ తల్లి ఇమ్రాన్ తన కూతురికి సరైన జోడివాడో కాదో తెలుసుకోవాలనుకుంది. అయితే జ్యోతిష్క్యుడు పుష్పవల్లికి ఏమి చెప్పాడో ఎవరికీ తెలియదు. అయితే భవిష్యత్తులో ఇమ్రాన్ ఖచ్చితంగా తన కుటుంబంలో భాగమవుతాడని నమ్మింది.

Rekha Marriage News

Rekha Marriage News

1980లో రేఖ.. పాకిస్తానీ క్రికెటర్‌తో డేటింగ్?

రేఖ ఇమ్రాన్ ల మధ్య ఉన్న సంబంధం స్నేహం కంటే ఎక్కువ అని కూడా ఆ నివేదిక పేర్కొంది. ఆ సమయంలో రేఖ, ఇమ్రాన్ లు కొన్నిసార్లు బీచ్ లో, కొన్నిసార్లు షూటింగ్ సెట్స్ లో ఒకరితో ఒకరు సంతోషంగా ఉండటం చూసిన వ్యక్తులున్నారు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని భావించారు. 1980లలో రేఖ ఇమ్రాన్ ఖాన్‌తో చాలాసార్లు తిరుగుతున్నట్లు కనిపించిందని.. ఇది వీరిద్దరి మధ్య ఏదో ఉండనే ఆలోచనలకు పుకార్లకు ఆజ్యం పోసిందని, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్త అప్పట్లో ఓ సంచలనం సృష్టించిందని పేర్కొన్నారు. అయితే రేఖ లేదా మాజీ పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్ర్రాన్ ఖాన్ తమపై వచ్చిన పుకార్లపై ఎప్పుడూ స్పందించలేదు. 1990లో ‘కిమత్’ హీరో ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకుని జీవితంలో రేఖ స్థిరపడింది. అయితే ముఖేశ కొంతకాలం తర్వాత మరణించారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
OTTలోకి వచ్చేసిన రియల్ లవ్ స్టోరీ..కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్