AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీప్‌గా చూడొద్దు.. అలాంటి వారికి వరం ఇవి.. డైలీ రెండు తిన్నారంటే ఇక తిరుగుండదు మామ..

మసాలా దినుసు యాలకులను ఆహారం రుచిని పెంచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతోపాటు.. యాలకులను టీతోపాటు పలు పానీయాల్లో కూడా రుచి కోసం వినియోగిస్తారు. ఇవి మంచి సువాసనతో రుచికరంగా ఉంటాయి.. అందుకే.. వీటిని.. సహజ మౌత్ ఫ్రెషర్‌గా ఉపయోగిస్తారు. అయితే.. డైలీ రెండు యాలకులు తినడం వల్ల ఎన్నో సమస్యలను నివారించవచ్చని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

చీప్‌గా చూడొద్దు.. అలాంటి వారికి వరం ఇవి.. డైలీ రెండు తిన్నారంటే ఇక తిరుగుండదు మామ..
Cardamom Benefits
Shaik Madar Saheb
|

Updated on: Oct 25, 2025 | 4:19 PM

Share

Cardamom Health Benefits: యాలకులు.. పవర్‌ఫుల్ మసాలా దినుసు.. యాలకులలో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధగుణాలు పుష్కలంగా దాగున్నాయి.. ఇవి ఎంత రుచిగా ఉంటాయో.. అంతే ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకులతో పలు అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు.. వాస్తవానికి యాలకులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి.. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంతోపాటు.. ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కలిగి ఉన్నాయి.. మసాలా దినుసు యాలకులను ఆహారం రుచిని పెంచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతోపాటు.. యాలకులను టీతోపాటు పలు పానీయాల్లో కూడా రుచి కోసం వినియోగిస్తారు. ఇవి మంచి సువాసనతో రుచికరంగా ఉంటాయి.. అందుకే.. వీటిని.. సహజ మౌత్ ఫ్రెషర్‌గా ఉపయోగిస్తారు. అయితే.. డైలీ రెండు యాలకులు తినడం వల్ల ఎన్నో సమస్యలను నివారించవచ్చని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

డైలీ యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. యాలకులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ వీటిని తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. రోజూ రెండు మూడు యాలకులు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయని..
  2. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయని పేర్కొంటున్నారు. అలాగే.. యాలకులు శరీరంలో మంటను తగ్గిస్తాయి..
  3. డైలీ యాలకులు తినడం వల్ల ఉబ్బసం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. యాలకులలోని పోషకాలు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని.. క్రమంగా కడుపు సమస్యలు దూరమవుతాయిన పేర్కొంటున్నారు.
  4. యాలకులలోని ఔషధ గుణాలు పురుషులు, స్త్రీలు వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా దూరం చేస్తాయని చెబుతున్నారు. ఇవి బలహీనతను దూరం చేసి.. శరీరాన్ని దృఢంగా మారుస్తాయని.. రోగనిరోధకశక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా లైంగిక జీవితం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
  5. యాలకులు బరువు పెరగడాన్ని కూడా నివారిస్తాయని.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతోపాటు.. బెల్లి ఫ్యాట్ ను నివారించడంలో సహాయపడతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి..
  6. యాలకులు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్‌లను తొలగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. కిడ్నీలను, మూత్రశాయాన్ని డిటాక్స్ చేస్తాయి.
  7. యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడంతోపాటు.. దంతాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇవి సహజ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేసి.. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి