AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom for Diabetes: షుగర్ ఉన్నవాళ్లు పుట్టగొడుగులు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది?

షుగర్ వ్యాధి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. తగ్గడం మళ్లీ జరగదు. ఒక్కసారి సోకిందంటే.. జీవితాంతం వెంటాడుతుంది. కేవలం మందులు వేసుకోవడం వల్లనే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్లు అన్నీ ఆహారాలు తినలేరు. ఏవి పడితే అవి తినకూడదు. ప్రత్యేకమైన డైట్ మెయిన్‌టైన్‌ చేయాలి. షుగర్ ఉన్నవాళ్లు ఒకేసారి ఆహారం..

Mushroom for Diabetes: షుగర్ ఉన్నవాళ్లు పుట్టగొడుగులు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది?
Mushrooms for Diabetes
Chinni Enni
|

Updated on: Jun 11, 2024 | 1:51 PM

Share

షుగర్ వ్యాధి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. తగ్గడం మళ్లీ జరగదు. ఒక్కసారి సోకిందంటే.. జీవితాంతం వెంటాడుతుంది. కేవలం మందులు వేసుకోవడం వల్లనే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్లు అన్నీ ఆహారాలు తినలేరు. ఏవి పడితే అవి తినకూడదు. ప్రత్యేకమైన డైట్ మెయిన్‌టైన్‌ చేయాలి. షుగర్ ఉన్నవాళ్లు ఒకేసారి ఆహారం తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి. అలాగే డయాబెటీస్ ఉన్నవారు ఏది తినాలన్నా అనుమానిస్తారు. ఈ క్రమంలో షుగర్ వ్యాధి ఉంటే మష్రూమ్స్ తినవచ్చా? తింటే ఏం జరుగుతుంది? అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మష్రూమ్స్‌లోని పోషకాలు:

పుట్టగొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా లభిస్తాయి. ప్రోటీన్, డైటరీ ఫైబర్, విటమిన్లు బి1, బి2, బి 12, సి, ఇలు, టర్పెన్, క్వినోలోన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

తినవచ్చా.. తినకూడదా..

మష్రూమ్స్ అంటే పుట్ట గొడుగులు తినడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్‌కి ఎలాంటి నష్టం కలగదు. మష్రూం అనేది ఒక సూపర్ ఫుడ్. దీన్ని ఎవ్వరైనా తినవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా.. గ్లైసెమిక్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. పుట్ట గొడుగుల్లో పంచదార, కార్బోహైడ్రేట్లు సమానంగా ఉండటం వల్ల కేలరీలు అదుపులో ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి సందేహం లేకుండా పుట్ట గొడుగులు తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా పుట్ట గొడుగులు తినవచ్చు.

ఇవి కూడా చదవండి

అనేక సమస్యలు మాయం..

మష్రూమ్స్‌లో పాలీ శాకరైడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ డయాబెటిక్‌గా పనిచేస్తాయి. కాబట్టి మష్రూమ్ తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్‌కి వ్యతిరేకంగా రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది మధుమేహం రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే మితంగా తీసుకోవాలి. ఇలా చేస్తే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. గుండె దడ, శరీర నొప్పులు వంటివి తగ్గుతాయి. మష్రూమ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అయితే కొందరికి మష్రూమ్స్ తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు దూరంగా ఉండటం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?