Health Tips: వయస్సు మళ్లినా.. మీ ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తినాల్సిందే
Bone Health Diet:మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతులో ఎముకల బలహీనత కూడా ఒకటి. సరైన ఆహారం లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన అలవాట్లు ఎముకలను అకాలంగా బలహీనపరుస్తాయి అలాగే పగుళ్లు, కీళ్ల నొప్పుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలానో తెలుసుకుందాం పదండి.

ప్రస్తుత జనరేషన్‌లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కీళ్ల నొప్పుడు, ఎముకల బలహీనత. ఎముకలు, కీళ్లలో బలం తగ్గడానికి వయస్సు పెరగడమే కారణం కాదు.. మనం రోజువారి జీవితంలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా వాటిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) డేటా ప్రకారం, ఎముక సంబంధిత వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ల మంది పగుళ్లకు గురవుతున్నారు.
అయితే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. ఎముకలు బలోపేతం కావడానికి, భవిష్యత్తులో కీళ్ల లేదా ఎముక శస్త్రచికిత్స ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ మార్పులు చాలా తోల్పడుతాయిని వివరించారు. కాబట్టి, మీ ఎముకలను బలోపేతం చేయడానికి డాక్టర్ సిఫార్సు చేసే ఆహారాల గురించి తెలుసుకుందాం.
View this post on Instagram
ఆకుకూరలు: పాలకూర, కాలే, బ్రోకలీ వంటి కూరగాయలు ఎముకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుకూరల్లో కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను పెంచి వాటిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
కొవ్వు చేపలు: సాల్మన్, సార్డిన్స్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కీళ్లలో మంటను తగ్గించి, వాటిని సరళంగా ఉంచడంలో సహాయపడతాయి.
పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఆహారాలను కాల్షియం, ప్రోటీన్ పవర్‌హౌస్‌లుగా అభివర్ణించారు వైద్య నిపుణులు. ఎందుకంటే వీటిలో ఈ పోషకాలన్ని పుష్కలంగా ఉంటాయి, అవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి. అలాగే అవి విరిగిపోకుండా నిరోధిస్తాయి.
ఎండిన పండ్లు, నట్స్: బాబాదం, వాల్‌నట్‌లు, చియా గింజలలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి కొత్త ఎముకలను నిర్మించడంలో, కీళ్లను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.
సిట్రస్ పండ్లు: వైద్య నిపుణుల ప్రకారం నారింజ, నిమ్మకాయలు, ఆమ్లా వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి, ఇది ఎముకలు, కీళ్లను సరళంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
వృద్ధాప్యంలో కూడా మీ ఎముకలు బలంగా ఉండాలని, కీళ్లలో నొప్పి రాకూడదని మీరు కోరుకుంటే, మీ ఎముకలు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇచ్చేలా ఈ 5 విషయాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




