AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా..! ఆ గదిలో అడుగుపెడితే.. మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి..!

నేవీలో పని చేసి రిటైర్డ్ అయిన రమణ కుమార్ ఈ అద్భుత ప్రపంచానికి రూపకల్పన చేసారు. ఆయన దుబాయ్ ఉన్న సమయంలో అక్కడ చూసిన ఇలాంటి మ్యూజియం స్ఫూర్తితో.. ఆ సరికొత్త అనుభూతి కల్పించేలా పర్యటకుల కోసం అందుబాటులోకి తెచ్చామంటున్నారు. దుబాయ్ లో కాన్సెప్ట్ చూసి చైనా నుంచి వస్తువులను తీసుకువచ్చి డిజైన్ చేశామని అంటున్నారు.

ఆహా..! ఆ గదిలో అడుగుపెడితే.. మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి..!
Visakhapatnam Theme World
Maqdood Husain Khaja
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 31, 2025 | 6:33 PM

Share

ముత్యాల పరదాలు.. మెరిసిపోయే గ్రహాలు.. స్టార్ వార్స్ సినిమాలోని స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్న అనుభూతి.. ఇక రివాల్వింగ్ టన్నెల్లో తిరిగే బ్రిడ్జి. మరి అవతార్ మూవీలోని అవతార్ ట్రీ మీ కళ్ళ ముందు కనిపిస్తే.. ఎస్.. వింటేనే ఎంతో థ్రిల్‌గా ఉంది కదూ..! అయితే మీలాంటి వారి కోసమే మాయా వరల్డ్ ఆహ్వానం పలుకుతుంది. విశాఖలో టియు-142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణంలో మిరుమిట్లు గోలిపే విద్యుత్ కాంతుల్లో.. అద్దాలా గదుల్లో అద్భుతమైన మాయ ప్రపంచం కొలువుదిరింది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక కాన్సెప్ట్‌తో ఇది ఆకట్టుకుంటుంది.

విశాఖ వచ్చే పర్యటకుల కోసం మరో ఆకర్షణ.. అదో మాయా ప్రపంచం..! ఎస్.. అందులో అడుగుపెట్టాక ఎక్కడ ఉన్నామో తెలియకపోతే..? అనంతమైన విశ్వంలో తేలియాడుతూ ఉన్న అనుభూతి కలిగితే..? మన కళ్లే మనల్ని మోసం చేసేస్తే..? విదేశాల్లో మాత్రమే కనిపించే అద్భుత మాయా ప్రపంచం ఇప్పుడు విశాఖ నగరానికి వచ్చేసింది.

ఆర్కే బీచ్ రోడ్డులోని టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం భవనంలో మాయా వరల్డ్ రూపుదిద్దుకుంది . ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే.. మీ జీవితంలో మీరు ఎన్నడూ పొందని ఎక్స్‌పీరియన్స్ అక్కడ కలుగుతుంది. ఈ మ్యూజియంలో 8 ఇన్ఫినిటీ రూమ్స్ ఉంటాయి. ఎనిమిది గదుల్లో ప్రత్యేక కాన్సెప్ట్స్ తో.. అద్భుతంగా మాయా వరల్డ్ ను తీర్చిదిద్దారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్ది ఒక్కో అనుభూతి. ముత్యాల పరదాలు మనల్ని చుట్టేస్తాయి. మెరిసిపోయే గ్రహాలు కట్టిపడేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన ప్రతిబింబమే మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవతార్ సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

ఒక్కో గది ఒక్కో ప్రత్యేకమైన థీమ్ తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గదిలోకి అడుగుపెట్టగానే.. ఆ గది అక్కడ పొడవు, వెడల్పు అంచనా వేయడం అసాధ్యం. దారి కూడా సరిగా గుర్తించలేం. ఎందుకంటే ఆ గదులకు ఆరు వైపులా.. అద్దాలే. అంటే.. నేల, పైకప్పు, నాలుగు గోడలు అద్దాలు ఉంటాయి. దీంతో మన కళ్లు కనికట్టుకు గురవక తప్పదు. ప్రతి గది ఒక ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అద్భుత ఊహ లోకంలోకి తీసుకెళ్తాయి.

రివాల్వింగ్ టన్నల్ బ్రిడ్జిలో తలకిందులయ్యేలా..!

అంతే కాదు.. స్టార్ వార్స్ సినిమాలోని స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్న అనుభూతిని కూడా కలుగుందట ఇక్కడ. బ్లింకింగ్ స్టార్స్ రూమ్, గ్లోయింగ్ ప్లానెట్ రూమ్, కెలైడో స్కోప్, అవతార్ ట్రీ, మిర్రర్ మేజ్, రెయిన్బో కాలమ్.. అంటూ ఎన్నో అద్భుతాలు మాయా వరల్డ్ లో ఉన్నాయి. ఇక రివాల్వింగ్ టన్నెల్ బ్రిడ్జి స్పెషల్ ఎట్రాక్షన్. ఆ బ్రిడ్జి పై నిల్చుంటే.. మనం తలకిందులైపోతామా అన్న అనుభూతి కలగక మానదు.

పిల్లల నుంచి వృద్ధుల వరకు.. మహిళలకు ప్రత్యేకం..!

ఇది పర్యాటకులకు.. ముఖ్యంగా యువతకు, పిల్లలకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఒక్కసారి అందులోకి వెళితే గంటల తరబడి ఉండిపోవాలని అనిపిస్తుంది. అక్కడే ఉంటూ ఆ మాయా ప్రపంచంలో విహరిస్తూ గడపాలని, ఆ అనుభూతి ఇంకా ఇంకా పొందాలని మనసు లాగేస్తుంటుంది. మహిళల కైతే అసలు కట్టుపడిస్తోంది మరి. ఎందుకంటే సెల్ఫీలు తీసుకునేందుకు, తమను ఆరువైపులా ఒకేసారి చూసుకునేందుకు ఇక్కడ ప్రత్యేకంగా అమర్చిన అద్దాల్లో ప్రతిబింబం చూస్తూ మురిసిపోవాల్సిందే.

దేశంలోనే తొలిసారిగా..

నేవీలో పని చేసి రిటైర్డ్ అయిన రమణ కుమార్ ఈ అద్భుత ప్రపంచానికి రూపకల్పన చేసారు. ఆయన దుబాయ్ ఉన్న సమయంలో అక్కడ చూసిన ఇలాంటి మ్యూజియం స్ఫూర్తితో.. ఆ సరికొత్త అనుభూతి కల్పించేలా పర్యటకుల కోసం అందుబాటులోకి తెచ్చామంటున్నారు. దుబాయ్ లో కాన్సెప్ట్ చూసి చైనా నుంచి వస్తువులను తీసుకువచ్చి డిజైన్ చేశామని అంటున్నారు.

ఈ మాయా ప్రపంచంలో విహరించేందుకు పరిమిత సమయం కేటాయిస్తారు. ఒక్కొక్కరికి 15 నిమిషాలు మాత్రమే.. పెద్దలకు టికెట్ ఏడేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం.. మరి ఇంకెందుకు ఆలస్యం.. భూమి పైనే ఉంటూ అనంత విశ్వంలో ఉన్నంత ఊహల లోకంలోకి వెళ్లాలంటే కచ్చితంగా ఈ మాయావరల్డ్ ను టచ్ చేయాల్సిందే!

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..