Bathing Tips: స్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా?
చిన్నతనంలో అమ్మమ్మ, నానమ్మలు పిల్లలకు స్నానం చేసేటప్పుడు గమనించారా? ఒకటికి రెండు సార్లు రుద్ది రుద్ది చేయిస్తారు. దీంతో పిల్లలు ఏడుపులంకించుకుంటారు. ఇలా స్నానం చేయించిన ప్రతిసారీ పిల్లల్ని వారు ఏడిస్తుంటారు. మోచేయి, మోకాళ్లు, చెవుల వెనుక శుభ్రం చేయడం, ముక్కు చీదించడం వంటివి చేస్తుంటారు. నేటికీ చిన్న పిల్లలకి స్నానం చేయించేటప్పుడు కూడా అదే పద్ధతిని వాడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాకుండా అమ్మమ్మలకు, నానమ్మలకు..

చిన్నతనంలో అమ్మమ్మ, నానమ్మలు పిల్లలకు స్నానం చేసేటప్పుడు గమనించారా? ఒకటికి రెండు సార్లు రుద్ది రుద్ది చేయిస్తారు. దీంతో పిల్లలు ఏడుపులంకించుకుంటారు. ఇలా స్నానం చేయించిన ప్రతిసారీ పిల్లల్ని వారు ఏడిస్తుంటారు. మోచేయి, మోకాళ్లు, చెవుల వెనుక శుభ్రం చేయడం, ముక్కు చీదించడం వంటివి చేస్తుంటారు. నేటికీ చిన్న పిల్లలకి స్నానం చేయించేటప్పుడు కూడా అదే పద్ధతిని వాడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాకుండా అమ్మమ్మలకు, నానమ్మలకు ఎప్పుడూ చర్మ సమస్యలు కూడా రావు? ఎందుకో గమనించారా.. చర్మంపై నివసించే చిన్న చిన్న సూక్ష్మజీవులను స్నానం చేసేటప్పుడు శుభ్రంగా క్లీన్ చేయకపోతే వివిధ రకాల చర్మ వ్యాధులకు దారి తీస్తుంది. అయితే చాలా మంది స్నానం సరిగ్గా చేయరు. హడావిడిగా కానిచ్చేస్తుంటారు. సరిగ్గా స్నానం చేయకుంటే శరీరంపై సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరచుకుంటాయి. శరీరంపై మురికి, చెమట, మృత కణాలను తొలగించడానికి లైట్ స్క్రబ్బింగ్ చేయాలంటున్నారు నిపుణులు. దీంతో శరీరం మొత్తం శుభ్రం చేయడం సులువు అవుతుంది.
గోరువెచ్చని నీరు- వేడి లేదా చల్లటి నీళ్లలో ఏది స్నానానికి వినియోగించాలో చాలా మందికి తెలియదు. ఎల్లప్పుడూ స్నానానికి గోరువెచ్చని నీళ్లను మాత్రమే ఉపయోగించాలి. వాష్‌క్లాత్‌తో స్క్రబ్బింగ్ చేయాలి. నేటికాలంలో చాలా మంది శరీరాన్ని స్క్రబ్ చేయడానికి లూఫా లేదా సింథటిక్ స్క్రబ్బర్‌ని ఉపయోగిస్తున్నారు . కానీ అమ్మమ్మ పద్ధతి ఉపయోగించడం బెటర్. స్క్రబ్బింగ్ కోసం ఎక్స్‌ఫోలియేషన్, క్లీనింగ్ కోసం మృదువైన వాష్‌క్లాత్ లేదా స్పాంజిని ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నారు నిపుణులు.
స్నానం చేసిన తర్వాత గట్టిగా రుద్దడానికి బదులుగా మెత్తని టవల్‌తో శరీరాన్ని పొడిగా అద్దడం చెయ్యాలి. ఎందుకంటే టవల్‌తో చర్మంపై గట్టిగా రుద్దడం వల్ల అవాంఛిత గుర్తులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే స్నానం చేసేటప్పుడు చెవులు, కాళ్లు, నాభి, గోళ్ల మధ్య భాగం శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో దుమ్ముధూళి, చెమట వంటి మలినాలు సులభంగా పేరుకుపోతాయి. అలాగే శరీర శుభ్రత కోసం శరీరాన్ని అతిగా శుభ్రపరచుకోవడం మానుకోవాలి. చర్మంలో రెండు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా సహజంగా సమతుల్యంగా ఉంటుంది. కానీ శరీరానికి వేడి నీటిని ఉపయోగించినప్పుడు, వాటి సమతుల్యత దెబ్బతింటుంది. బదులుగా తేలికపాటి pH- బ్యాలెన్స్‌డ్ క్లెన్సర్‌ని ఉపయోగించాలి. చర్మాన్ని చాలా గట్టిగా స్క్రబ్ చేయకూడదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.








