- Telugu News Photo Gallery Eye Care: Do you have itchy eyes? Don't ignore it, there is a possibility of problems
Eye Care Tips: కళ్లు అదురుతున్నాయా.. లక్ కాదు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది!
సాధారణంగా అప్పుడప్పుడు కళ్లు అదురుతూ ఉంటాయి. ఇలా అదిరినప్పుడు ఏదో మంచి జరుగుతుందని అంటూంటారు పెద్దలు. కుడి కన్ను అదిరితే చెడు జరుగుతుందని.. ఎడమ కన్ను అదిరితే మంచి జరగబోతుందని అంటూంటారు. కానీ ఇవన్నీ మూఢ నమ్మకాలే. మీకు ఎప్పుడైతే కళ్లు అదిరినట్టు అనిపించినా.. వణికినట్టు అనిపించినా.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ లక్షణాలు మీకు కనిపిస్తే.. మీకు తగినంత నిద్ర లేదని, స్క్రీనింగ్ ఎక్కువగా చూస్తున్నారని, ఒత్తిడి, ఆందోళన..
Updated on: Nov 10, 2023 | 8:08 PM

సాధారణంగా అప్పుడప్పుడు కళ్లు అదురుతూ ఉంటాయి. ఇలా అదిరినప్పుడు ఏదో మంచి జరుగుతుందని అంటూంటారు పెద్దలు. కుడి కన్ను అదిరితే చెడు జరుగుతుందని.. ఎడమ కన్ను అదిరితే మంచి జరగబోతుందని అంటూంటారు. కానీ ఇవన్నీ మూఢ నమ్మకాలే. మీకు ఎప్పుడైతే కళ్లు అదిరినట్టు అనిపించినా.. వణికినట్టు అనిపించినా.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

ఈ లక్షణాలు మీకు కనిపిస్తే.. మీకు తగినంత నిద్ర లేదని, స్క్రీనింగ్ ఎక్కువగా చూస్తున్నారని, ఒత్తిడి, ఆందోళన, అలసట, మందులు ఎక్కువగా తీసుకన్నా, కెఫిన్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువగా కళ్లు అదిరినా, వణికినా రెస్ట్ అవసరం అని తెలుసుకోండి.

ఈ సమస్య తగ్గాలంటే.. కళ్లకి కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలి. కాఫీ లేదా టీ వంటి కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. కొన్ని మందుల వాడకం వల్ల కూడా ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వైద్యులని సంప్రదించడం మేలు.

అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రతి 20 నిమిషాలకు.. కనీసం 20 సెకన్ల పాటు అయినా బ్రేక్ తీసుకోవడం మంచిది. రెప్పలు వేస్తూ ఉండాలి. ఎప్పుడూ కళ్లని రీఫ్రెష్ గా ఉంచుకోవాలి. దగ్గర్లో ఉన్న పచ్చని వస్తువులని చూడాలి.

ఈ కళ్లు వణకడం, అదరడం వంటి సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం తప్పని సరిగా వైద్యుల్ని సంప్రదించడం మేలు. ఇలా ఉంటే మల్టిపుల్ స్ల్కె రోసిస్ లేదా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలుగా భావించవచ్చు. ఇది ఒక్కోసారి మెదడు పై కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.




